E-Paper
Advertisement

Smart Ring : మనిషి ఆరోగ్యాన్ని కనిపెట్టే స్మార్ట్ రింగ్..

Smart Ring : మనిషి ఆరోగ్యాన్ని కనిపెట్టే స్మార్ట్ రింగ్..
Advertisement

Smart Ring : ఈరోజుల్లో ఎన్నో స్మార్ట్ పరికరాలు అనేవి మనుషుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండే విషయంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ వాచ్ దగ్గర నుండి స్మార్ట్ మొబైల్ వరకు అన్ని స్మార్ట్ పరికరాలకు మనుషులు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఇదే విధంగా మరింత చిన్నగా ఉండే ఒక స్మార్ట్ పరికరాన్ని మనుషులు ధరించే విధంగా శాస్త్రవేత్తలు తయారు చేశారు. అదే స్మార్ట్ రింగ్. ఈ స్మార్ట్ రింగ్‌ మనుషులకు ఎంతో సాయంగా ఉంటుందని వారు తెలిపారు.

హెల్త్ కేర్ విషయంలో తాము మరింత ముందుగా ఉండాలని పెన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అనుకున్నట్టు ఉన్నారు. అందుకే రియాలిటీలో జరగదు అనే విషయాన్ని నిజం చేసి చూపించారు. అదే స్మార్ట్ రింగ్. స్మార్ట్ వాచ్‌లు అనేవి మార్కెట్లో సెన్సేషన్ సృష్టించిన తర్వాత స్మార్ట్ రింగ్స్ అనేవి కూడా ఉంటే బాగుంటుందని చాలా దేశాల శాస్త్రవేత్తలు ఆలోచన వచ్చింది. అదే ఆలోచనతో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మెరుగైన పద్ధతిలో ఈ స్మార్ట్ రింగ్‌ను తయారు చేశారు.

Advertisement

ఒమ్నిరింగ్ పేరుతో స్మార్ట్ సెన్సింగ్ రింగ్‌ను శాస్త్రవేత్తలు తయారు చేసి చూపించారు. ఇందులో ఇనెర్షియల్ మెజర్మెంట్ యూనిట్ (ఐఎమ్‌యూ) సెన్సార్లు ఉంటాయి. ఇవి లొకేషన్‌తో పాటు మనిషి చేతి వేళ్ల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఐఎమ్‌యూతో పాటు ఫోటోప్లెథిస్మోగ్రాఫీ (పీపీజీ) సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి రక్తనాళాల్లోని మార్పులను కనిపెడుతూ ఉండేలా డిజైన్ చేశారు. దీంతో పాటు పీపీజీ సెన్సార్లు హార్ట్ రేటు, గ్లూకోజ్ లెవెల్స్, ఆక్సిజన్ వంటి విషయాలను కూడా కనిపెడుతూ ఉంటాయి.

స్మార్ట్ రింగ్ అనేది మనిషిపై ఒత్తిడిని కూడా కనిపెడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో పాటు స్మార్ట్ రింగ్‌కు మరికొన్ని కొత్త ఫీచర్స్‌ను అందించాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. స్మార్ట్ వాచ్‌లలాగా కాకుండా ఒమ్నిరింగ్‌కు డిస్‌ప్లే ఉండదని, అంతే కాకుండా దానికంటే దీని బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం ఉంటుందని తెలిపారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా స్మార్ట్ రింగ్ అనేది మనిషి ఆరోగ్యాన్ని కనిపెడుతూ ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ఈ స్మార్ట్ రింగ్ ప్రస్తుతం కొన్ని అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లలో అందుబాటులో ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×