E-Paper
Advertisement

Pilot Rohith Reddy: మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి.. ఈసారి రంగంలోకి రెవెన్యూ అధికారులు!

Pilot Rohith Reddy: మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి.. ఈసారి రంగంలోకి రెవెన్యూ అధికారులు!
Advertisement

Pilot Rohith Reddy: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్ లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్టు రెవిన్యూ అధికారులు గుర్తించారు. అంతంగారి జంగయ్య పేర ఉన్న ఈ భూమిలో పైలట్ రోహిత్ రెడ్డి తన తండ్రి విఠల్ రెడ్డి పేర ఫామ్ హౌస్ నిర్మించినట్టు నిర్ధారించారు. ఈ క్రమంలో అసైన్డ్ భూమి పైలట్ రోహిత్ రెడ్డి చేతికి ఎలా వచ్చింది? అన్న దిశగా విచారణ చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ పరిధి సర్వే నెంబర్ 177/33లోని రెండు ఎకరాల్లో పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ వార్తల్లో నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారంటూ ఇదే ఫార్మ్ హౌస్ లో సింహాయాజీ స్వామి, నందకుమార్ తదితరులను అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంలో తన ఫోన్ ను అక్రమంగా ట్యాప్ చేశారాంటూ నందకుమార్ ఫిర్యాదు కూడా చేశారు.

Advertisement

తాజాగా ఇదే ఫార్మ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తోపాటు మరికొందరితో కలిసి డ్రగ్ పార్టీ చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్ అధికారులు, ఫ్యూచర్ సిటీ ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులతో కలిసి దాడి చేశారు. ఆ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డికి చెందిన రివాల్వర్ తో నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు సైతం జరిపాడు. ఈ సంఘటనలో పోలీసులు పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను చెంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు. అదే సమయంలో ఫార్మ్ హౌస్ పై చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులకు లేఖ రాశారు.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులు ఫార్మ్ హౌస్ ఉన్న రెండు ఎకరాల భూమి అసైన్డ్ ల్యాండ్ అని గుర్తించారు. ఇది అంతంగారి జంగయ్య పేరు మీద ఉన్నట్టు నిర్ధారించారు. నిజానికి అసైన్డ్ భూమిని ఎవరికైనా కేటాయిస్తే వాళ్లు దాంట్లో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. తప్పితే ఇతర కార్యకలాపాలు నిర్వహించటానికి వీల్లేదు. ఆలా చేస్తే భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. అయినా, పైలట్ రోహిత్ రెడ్డి తన తండ్రి విఠల్ రెడ్డి పేరు మీద విలాసవంతమైన ఫార్మ్ హౌస్ కట్టి అన్ని రకాల కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Also Read: IPL Recharge Plans 2026: ఐపీఎల్ స్పెషల్.. హాట్‌స్టార్ ఫ్రీగా లభించే.. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

ఈ నేపథ్యంలో అంతంగారి జంగయ్యను పిలిపించి ఆయన పేర ఉన్న అసైన్డ్ భూమి పైలట్ రోహిత్ రెడ్డి చేతుల్లోకి ఎలా వెళ్లింది? అన్న వివరాలను తీసుకోనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంట్లో వెల్లడయ్యే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఫార్మ్ హౌస్ ను సీజ్ చేస్తామని సైతం హెచ్చరించారు. అదే జరిగితే పైలట్ రోహిత్ రెడ్డికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: Gold Price Fall: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం రివర్స్ ట్రెండ్.. ఎందుకీ విచిత్ర పరిస్థితి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×