E-Paper
Advertisement

EV Subsidy Scheme: 90 శాతం సబ్సిడీతో ఎలక్ట్రిక్ వెహికల్స్.. ఇలా అప్లై చేసుకోండి

EV Subsidy Scheme: 90 శాతం సబ్సిడీతో ఎలక్ట్రిక్ వెహికల్స్.. ఇలా అప్లై చేసుకోండి
Advertisement

EV Subsidy Scheme: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు 90 శాతం సబ్సిడీతో ఎలక్ట్రిక్ వెహికల్స్ అందిస్తోంది. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై 90 శాతం సబ్సిడీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

90 శాతం సబ్సిడీతో

స్వయం ఉపాధితో పాటు, ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్ పోర్టులో భాగంగా.. హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ యువతకు ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్ ను 90 శాతం సబ్సిడీతో అందిస్తుంది. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ( https://tsobmms.cgg.gov.in) లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు Caste Certificate, Income Certificate ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆదాయం ఉండాలి. రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 17 నుంచి ప్రారంభం అయింది.

మార్చి 24 చివరి తేదీ

Advertisement

అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీకి దరఖాస్తు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా సరైన పత్రాలను అప్లైడ్ చేయాలని సూచించారు. మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ స్కీమ్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఈవీ త్రీ వీలర్స్, ఎలక్ట్రిక్ పాసెంజర్ ఆటోలు, ఎలక్ట్రిక్ కమర్షియల్ ఆటోలను అందిస్తున్నారు.

దరఖాస్తు విధానం ఇలా?

1. అధికారిక వెబ్ సైట్ https://tsobmms.cgg.gov.in పై క్లిక్ చేయండి.
2. ఆ తర్వాత ‘ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ (ఎస్సీ కార్పొరేషన్)’ లింక్ పై క్లిక్ చేయండి.
3. ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
4. రిజిస్ట్రేషన్ పేజీలో ఆధార్ ప్రకారం లబ్దిదారుడి పేరు, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
5. బెనిఫిషియరీ టైప్ లో Individual, సెక్టార్ టైప్ లో ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ అని సెలెక్ట్ చేయాలి.
6. ఆ తర్వాత స్కీమ్ లో ఎలక్ట్రిక్ వెహికల్ టైప్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
7. ఆ తర్వాత జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు నమోదు చేయాలి.
8. బ్యాంకు, లబ్దిదారుడి వివరాలను నమోదు చేయాలి.
9. లబ్దిదారుడి ఫొటో, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి.
10. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి, అన్ని వివరాలు సరిచూసి సబ్మిట్ చేయాలి.

Advertisement

Also Read:  సిటీలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్, ముగ్గురు కలిసి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేయొచ్చు!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×