E-Paper
Advertisement

బండి కొడుకు వ్యవహారం.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు

బండి కొడుకు వ్యవహారం.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు
Advertisement

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలకు అలాగే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయమని దీనిని రాజకీయ కోణంలో చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఈ కేసు విచారణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రామచందర్ రావు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం దర్యాప్తు జరగాలని పేర్కొంటూనే.. బండి సంజయ్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై అనుమానాలు ఉంటే విచారణ జరిపించుకోవచ్చని స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునే ప్రక్రియలో పార్టీ జోక్యం ఉండదని వెల్లడించారు.

Advertisement

రాజకీయంగా ఈ అంశాన్ని పార్టీకి ముడిపెట్టడం సమంజసం కాదని ఆయన పునరుద్ఘాటించారు. ఒక వ్యక్తిపై నమోదైన కేసును పార్టీకి ఆపాదించడం రాజకీయ దురుద్దేశమే అవుతుందని విమర్శించారు. ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి నిజానిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ALSO READ: తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, కేబినెట్ మంత్రి జేబులో

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×