E-Paper
Advertisement

BJP: బండి, రెడ్డి జాయింట్ ఆపరేషన్!.. కేసీఆర్‌పై డబుల్ బ్యారెల్ గన్!!

BJP: బండి, రెడ్డి జాయింట్ ఆపరేషన్!.. కేసీఆర్‌పై డబుల్ బ్యారెల్ గన్!!
Advertisement
bandi sanjay kishan reddy

BJP News Telangana(TS politics): కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్‌రెడ్డి. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కిషన్‌రెడ్డి.. రెండు ప్రధాన అంశాలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తోందన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని.. రాష్ట్రంలో నయా నిజాం తరహా పాలన సాగుతోందని మండిపడ్డారు.

సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగడం లేదన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో నిరంకుశ పాలనకు పాతరేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని.. కల్వకుంట్ల కుటంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇస్తానన్న కేసీఆర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. పార్టీ ఆఫీసుల నిర్మాణానికి స్థలం ఉంటుంది కానీ.. పేదలకు ఇల్లు కట్టించేందుకు స్థలం ఉండదా అంటూ కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కిషన్‌రెడ్డి.

Advertisement

కిషన్‌రెడ్డి నేతృత్వంలో అందరం కలిసికట్టుగా పని చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌. తెలంగాణలో గడీల పాలనను అంతమొందించడమే అందరి లక్ష్యమన్నారు బండి. కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్‌.

అధ్యక్ష పదవి మార్పు తర్వాత.. ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లకుండా.. జాయింట్‌గా మీడియా ముందుకు వచ్చి.. కేసీఆర్ సర్కారుపై.. జంటగా విమర్శలు చేశారు వారిద్దరు. ఇకముందు కూడా ఇలానే కలిసి పోరాడుతామనే మెసేజ్ ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×