E-Paper
Advertisement

Big TV Medical Camp: బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్.. నలుగురికి ఉచిత కంటి ఆపరేషన్లు

Big TV Medical Camp: బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్.. నలుగురికి ఉచిత కంటి ఆపరేషన్లు
Advertisement

Big TV Medical Camp: సమాజ సేవే లక్ష్యంగా ముందుకుసాగుతున్న బిగ్ టీవీ ఆధ్వర్యంలోని మెడికల్ క్యాంపు.. మరోసారి పేదల జీవితాల్లో వెలుగు నింపింది. నవంబర్ 27న దుండిగల్ మునిపాలిటీ పరిధిలోని గాగిల్లాపూర్‌లో నిర్వహించిన.. ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా నలుగురుకి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సేవా కార్యక్రమం మమతా హాస్పిటల్ సౌజన్యంతో జరగడం విశేషం.

చాలా కాలంగా కంటి సమస్యలతో బాధపడుతున్న ఈ నలుగురు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ టీవీ నిర్వహించిన మెడికల్ క్యాంపు వారికి ఆశాకిరణంగా మారింది. స్థానికుల సహకారంతో నిర్వహించిన ఈ క్యాంపులో అనుభవజ్ఞులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించారు.

Advertisement

అనంతరం, ఎంపికైన నలుగురు రోగులను మమతా హాస్పిటల్‌కు తరలించి, అక్కడ అన్ని ఆధునిక సదుపాయాలతో కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఎలాంటి ఖర్చు లేకుండా జరిగిన ఈ చికిత్సలు పూర్తిగా విజయవంతమయ్యాయని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండటంతో పాటు, చూపు మెరుగుపడిందని వెల్లడించారు.

కళ్లకు వెలుగు వచ్చిన ఆనందంతో ఆ నలుగురు రోగులు.. ఎంతో సంతోషంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న దృశ్యాలు అక్కడున్న వారందరినీ కదిలించాయి. తమలాంటి పేదలకు ఇంతటి సేవ అందించిన బిగ్ టీవీకి, మమతా హాస్పిటల్ యాజమాన్యానికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

సమాజంలో ఇంకా అనేక మంది పేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తామని బిగ్ టీవీ యాజమాన్యం తెలిపింది. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందాలన్నదే తమ లక్ష్యమని బిగ్ టీవీ పేర్కొంది.

స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ప్రభుత్వానికి తోడుగా ప్రైవేట్ సంస్థలు, మీడియా కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడితే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, పేదల కోసం కంటి వైద్య శిబిరాలు ఎంతో అవసరమని తెలిపారు.

Also Read: మెగా మెడికల్ క్యాంప్స్.. బిగ్ టీవీ ఆరోగ్య యజ్ఞం.. ఇక్కడితో ఆగేది కాదు..

నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపిన ఈ కార్యక్రమం, మానవత్వానికి ప్రతీకగా నిలిచిందని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని, మరెన్నో జీవితాల్లో వెలుగు నింపాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×