E-Paper
Advertisement

Sarfaraz Khan: CSKలోకి ఎంట్రీ.. హీరో నాని సీన్ రిపీట్.. స‌ర్ఫ‌రాజ్ పోస్ట్ వైర‌ల్

Sarfaraz Khan: CSKలోకి ఎంట్రీ.. హీరో నాని సీన్ రిపీట్.. స‌ర్ఫ‌రాజ్ పోస్ట్ వైర‌ల్
Advertisement

Sarfaraz Khan: దుబాయ్ వేదికగా జరిగిన ఐపిఎల్ 2026 మినీ ఆక్షన్ లో ముంబై బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ కి ఊహించని షాక్ తగిలింది. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పటికీ ఇతడిని మొదట ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. కేవలం రూ. 75 లక్షల బేస్ ప్రైస్ కి కూడా సర్పరాజ్ ఖాన్ ని కునేందుకు ఏ జట్టు ముందుకు రాకపోవడంతో వేళంలో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు.

Also Read: Jasprit Bumrah: బుమ్రా ఫ్యామిలీకి ఏమైంది.. టీ20 సిరీస్ మధ్యలో ఎందుకు ముంబై వెళ్లారు?

Advertisement

మొదట సర్పరాజ్ ఖాన్ కి కొనుగోలుదారు దొరకకపోయినా.. ఆక్షన్ లోని యాక్సిలరేటర్ రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగడంతో సర్పరాజ్ చెన్నై జట్టులో చేరాడు. ఇటీవల సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సర్ఫరాజ్ చూపించిన దూకుడు ఆట తీరుతో చెన్నై సూపర్ కింగ్స్ కి కీలక ఆటగాడిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

22 బంతుల్లో 73 పరుగుల మెరుపు ఇన్నింగ్స్:

Advertisement

ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ ప్రారంభానికి ఒకరోజు ముందు సర్ఫరాజ్ ఖాన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కేవలం 22 బంతుల్లో 73 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టి-20 లలో కూడా హార్డ్ హిట్టింగ్ చేయగలనని నిరూపించుకున్నప్పటికీ.. మొదట ఇతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక చివరగా చెన్నై సూపర్ కింగ్స్ ఇతడిని కొనుగోలు చేయడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో తన ఇన్స్టా స్టోరీలో న్యాచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” సినిమాలో ట్రైన్ వద్ద నాని అరిచే ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేశాడు. ఇక సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్ లలో 329 పరుగులు చేశాడు. అంతేకాకుండా 203.08 స్ట్రైక్ రేటుతో మూడు హాఫ్ సెంచరీలు, తొలి టి-20 సెంచరీ బాధాడు. గత ఆదివారం హర్యానాతో జరిగిన మ్యాచ్ లో కూడా కేవలం 25 బంతుల్లో 64 పరుగులు చేసి.. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై చేదించడంలో కీలకపాత్ర పోషించాడు.

 

టీమిండియాలో కూడా స్థానం దక్కడం లేదు:

సర్ఫరాజ్ ఖాన్ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో పరుగుల పరద పారిస్తున్నప్పటికీ ఇతడికి టీమిండియాలో స్థానం దక్కడం లేదు. దీంతో ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం లభిస్తుందని సర్పరాజ్ ఖాన్, అతడి అభిమానులు బలంగా ఆశిస్తున్నారు. ఇతడు ఇప్పటికే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లకు ఆడాడు. ఇప్పటివరకు 50 మ్యాచ్లలో 585 పరుగులు చేశాడు.

Also Read: BBL-Shaheen Afridi: షాహీన్ అఫ్రిదికి ఘోర అవమానం.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ తొలగించిన అంపైర్

అతడి సగటు 22.50 కాగా.. స్ట్రైక్ రేట్ 130.58గా ఉంది. ఇతడు చివరిసారిగా 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగాడు. మొత్తం టి-20 క్రికెట్ లో 28 ఏళ్ల సర్పరాజ్ ఖాన్ 1517 పరుగులు చేశాడు. ఈ ఏడాది అక్టోబర్ లో ఫిట్నెస్ పై దృష్టి సారించి.. ఏకంగా 17 కిలోల మేర బరువు తగ్గి స్లిమ్ గా మారాడు. కానీ సెలక్టర్ల దృష్టిని మాత్రం అకట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2026లో మంచి ప్రదర్శన ద్వారా మళ్ళీ జాతీయ జట్టులోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×