E-Paper
Advertisement

శునకాల రక్తంతో వ్యాపారం.. బిగ్‌టీవీ ‘ఆపరేషన్’తో బట్టబయలైన పెట్ కేర్ హాస్పిటల్ దందా!

శునకాల రక్తంతో వ్యాపారం.. బిగ్‌టీవీ ‘ఆపరేషన్’తో బట్టబయలైన పెట్ కేర్ హాస్పిటల్ దందా!
Advertisement

Hospital Seized: రాయదుర్గంలోని ‘పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ కేంద్రంగా సాగుతున్న అమానవీయ దందాను బిగ్‌టీవీ వరుస కథనాలతో ఎండగట్టింది. నోరు లేని జీవాల ప్రాణాలతో చెలగాటమాడుతూ, వీధి కుక్కల రక్తాన్ని విక్రయిస్తున్న వైనాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టింది. బిగ్‌టీవీ ప్రతినిధులు ప్రాణాలకు తెగించి చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో నిజాలు బయటపడుతున్నాయన్న కంగారులో ఆస్పత్రి సిబ్బంది బిగ్‌టీవీ ప్రతినిధిపై దాడికి యత్నించడం గమనార్హం.

రంగంలోకి జీహెచ్‌ఎంసీ.. సీజ్ చేసిన అధికారులు
బిగ్‌టీవీ కథనాలపై తక్షణమే స్పందించిన సైబరాబాద్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ సృజన, సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసుల సహకారంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆస్పత్రిపై మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆస్పత్రికి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని నిర్ధారించిన అధికారులు, వెంటనే ఆస్పత్రిని సీజ్ చేశారు.

Advertisement

ప్రభుత్వ డాక్టరే సూత్రధారి.. సస్పెన్షన్ వేటు
ఈ దారుణమైన రక్తపు దందా వెనుక ప్రభుత్వ వెటర్నరీ డాక్టరే సూత్రధారిగా ఉండటం విచారకరం. ఆస్పత్రి యజమాని, ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడు వెంకటేష్ యాదవ్, తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. బిగ్‌టీవీ అందించిన ఆధారాలను పరిశీలించిన పశుసంవర్ధక శాఖ, ఆయనపై వేటు వేసింది. వెంకటేష్ యాదవ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అసలు ఈ ‘రక్తపు దందా’ ఎలా సాగిందంటే?
వీధుల్లో తిరిగే అమాయకపు కుక్కలను పట్టుకొచ్చి, వాటి శరీరం నుంచి అడ్డగోలుగా రక్తాన్ని సేకరించి, అత్యధిక ధరలకు ఇతర పెట్ ఓనర్లకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సరైన వైద్య పద్ధతులు పాటించకుండా, కేవలం లాభాపేక్షతోనే ఈ అక్రమ వ్యాపారం సాగించినట్లు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, మూగజీవాల పాలిట ఈ ఆస్పత్రి ఒక వధశాలగా మారిందని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

Advertisement

Also Read: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. బోల్తా పడిన ప్రైవేటు బస్సు.. స్పాట్ లో!

బిగ్‌టీవీ సామాజిక బాధ్యత.. హర్షం వ్యక్తం చేస్తున్న జనం
సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించడమే కాకుండా, మూగజీవాల ప్రాణాలను కాపాడటంలో బిగ్‌టీవీ కీలక పాత్ర పోషించింది. ఆస్పత్రి సిబ్బంది బెదిరింపులకు భయపడకుండా నిజాలను వెలుగులోకి తెచ్చినందుకు ప్రజలు మరియు జంతు సంరక్షణ సంఘాలు బిగ్‌టీవీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఈ ఘటనతోనైనా అనుమతులు లేని ఇలాంటి నకిలీ క్లినిక్‌ల కట్టడికి ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×