E-Paper
Advertisement

HBD Sai Pallavi: సాయి పల్లవి రెమ్యునరేషన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

HBD Sai Pallavi: సాయి పల్లవి రెమ్యునరేషన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Advertisement

HBD Sai Pallavi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాయి పల్లవి.. అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీ అందుకుంది.. తొలిసారి ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె మొదటి సినిమాలోనే పక్కా తెలంగాణ అమ్మాయి పాత్రలో అబ్బురపరిచింది.” భానుమతి.. హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్”..అంటూ చెప్పే డైలాగ్స్ కి అభిమానులు విపరీతంగా ఫిదా అయిపోయారు. అలా ఈమెను సొంత ఇంటి అమ్మాయిల ఓన్ చేసేసుకున్నారు. ఎంత అద్భుతంగా నటించగలదో.. అంతకుమించి డాన్స్ కూడా చేయగలదు. ఈ బ్యూటీ నాట్యం మయూరిలా మెలికలు తిరుగుతూ ఈమె చేసే డాన్స్ పెర్ఫార్మెన్స్ కి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారనడంలో సందేహం లేదు.

బాలీవుడ్లో తొలి అడుగు.. కానీ తప్పని నిరాశ..

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అమీర్ ఖాన్ నిర్మాణంలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తొలి పరిచయంలో వచ్చిన ఏక్ దిన్ చిత్రం ద్వారా సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అయితే మొదటి సినిమానే డిజాస్టర్ గా నిలవడం గమనార్హం . ఇకపోతే బాలీవుడ్లో మరొకవైపు నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం సినిమాలో నటిస్తోంది. ఇందులో సీత పాత్రలో ఒదిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ దీపావళి సందర్భంగా మొదటి భాగాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

సాయి పల్లవి రెమ్యూనరేషన్ డీటెయిల్స్.

Advertisement

ఇకపోతే ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు.. 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఆమె రెమ్యూనరేషన్ తో పాటు ఆమె ఆస్తుల వివరాలు కూడా వైరల్ గా మారాయి. సాయి పల్లవి ఆస్తుల విలువ సుమారుగా రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3నుండి రూ.15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుగులో ఈమె చివరిగా నటించిన తండేల్ సినిమా కోసం ఈమె ఏకంగా రూ.5కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న సాయి పల్లవి తమిళ్లో చివరిగా నటించిన అమరన్ చిత్రం కోసం రూ. 3కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు వస్తున్న రామాయణం సినిమాకు మాత్రం రూ.15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది .

also read;Tollywood: ఘనంగా మెహర్ రమేష్ కూతురి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

సాయి పల్లవి ఆస్తుల విలువ..

Advertisement

సౌత్ లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది సాయి పల్లవి. ఇకపోతే సాయి పల్లవి నటి మాత్రమే కాదు వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ కూడా.. చదువు పూర్తయిన తర్వాతే ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టి ఇక్కడ కూడా విజయాలు అందుకుంటుంది..ఈమె జన్మస్థలం ఊటీ సమీపంలోని కోటగిరి.. ఈమె బడగ తెగకు చెందినవారు. ఇక ఈమెకు చెల్లెలు కూడా ఉంది. ఆమె పూజా కన్నన్. చెల్లెలు పెళ్లిని కూడా దగ్గరుండి ఘనంగా జరిపించింది..అయితే సాయి పల్లవి ఆచితూచి అడుగులు వేస్తూ ఒక్కో సినిమాకి భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.. ఇక ఇప్పుడు ఏక్ దిన్ సినిమా నిరాశపరిచిన రామాయణం సినిమాతో సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది సాయి పల్లవి. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×