// // Bandi Sanjay : ఇంటి నుంచి బయటికొస్తే అరెస్ట్.. గృహనిర్బంధంలో బండి సంజయ్.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Bandi Sanjay : ఇంటి నుంచి బయటికొస్తే అరెస్ట్.. గృహనిర్బంధంలో బండి సంజయ్..

Bandi Sanjay : ఇంటి నుంచి బయటికొస్తే అరెస్ట్.. గృహనిర్బంధంలో బండి సంజయ్..
Advertisement

Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండి సంజయ్ నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి పాదయాత్ర చేపట్టేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అలాగే అక్కడ బీజేపీ బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. పాదయాత్ర కోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తుండగా బండి సంజయ్‌ను.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ శివారులో పోలీసులు అడ్డుకున్నారు.

తాజాగా బండి సంజయ్‌ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. అక్కడ భారీగా సిబ్బందిని మోహరించారు. బండి సంజయ్ ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ బయటకు వస్తే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. పాదయాత్రను ఎలాగైనా ప్రారంభించాలన్న పట్టుదలతో బండి సంజయ్ ఉన్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement

అటు పాదయాత్ర అనుమతి కోసం బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి అనుమతి వస్తేనే ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగనుంది. అటు బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు భైంసాకు భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భైంసాలో బీజేపీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తంమీద బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభంకాకుండానే తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×