E-Paper
Advertisement

‘అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే విజేతలు వారే’.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సెటైర్లు!

‘అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే విజేతలు వారే’.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సెటైర్లు!
Advertisement

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు బిగ్ బాస్ షో ను తలపిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చురకలంటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నటన అద్భుతమని ఎక్స్ వేదికగా విమర్శించారు. ముందే రిహార్సల్ చేసి పోటాపోటీగా నటనలో జీవిస్తున్నారని చురకలంటించారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులే అని ఎద్దేవాచేశారు. అయినా.. తెలంగాణ ప్రజలేమైనా తెలివి తక్కువ వారు కాదని పేర్కొన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రస్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో డేట్, టైం, వేదిక ఫిక్స్ చేస్తామని.. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతోపాటు అవినీతి, అక్రమాలపైనా చర్చించేందుకు రావాలని బండి సవాల్ విసిరారు. ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమా? అని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు తాము రెడీ అని పేర్కొన్నారు.

Advertisement

Also Read: ట్రాఫిక్ జామ్‌లో హార్ట్ ఎటాక్.. బస్సులోంచి దూకి.. ప్రాణాలు కాపాడిన నర్సులు!

కేంద్రంలోని మోగీ ప్రభుత్వం.. తెలంగాణ అభివృద్ధికి చేసిన ఖర్చులు, ఇచ్చిన నిధులు, అందించిన సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చించేందుకు రావాలన్నారు. ఈ రెండు పార్టీలు ఇలాగే డ్రామాలాడితే జనం ఛీకొట్టడం ఖాయమని సంజయ్ పేర్కొన్నారు. ఈ రాజకీయ బిగ్ బాస్ షోలో.. ప్రజలు డబుల్ ఎలిమినేషన్ కోరుకుంటున్నారని, తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

Advertisement

Also Read: ప్రార్థనా స్థలాలు, పోలీస్ స్టేషన్లే టార్గెట్.. దిల్లీలో రక్తపాతానికి పాక్ భారీ కుట్ర!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×