E-Paper
Advertisement

Bandi Sanjay: పోలవరం, నిజాం షుగర్, నిరుద్యోగం.. కేసీఆర్ పై బండి సంజయ్ ప్రశ్నల వర్షం..

Bandi Sanjay: పోలవరం, నిజాం షుగర్, నిరుద్యోగం.. కేసీఆర్ పై బండి సంజయ్ ప్రశ్నల వర్షం..
Advertisement

Bandi Sanjay: ఏపీ బీఆర్ఎస్ కు తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా ప్రకటించి ఆంధ్రాలో పార్టీ ప్రస్థానం ప్రారంభించారు కేసీఆర్. విశాఖ ఉక్కును అమ్మనీయబోమని అన్నారు. ఏపీ సంగతి సరే.. మరి తెలంగాణకు ఇచ్చిన హామీల మాటేంటి? అంటూ నిలదీశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు లేకుండానే.. ఏపీకి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మరి, బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడు ఎవరంటూ ప్రశ్నించారు బండి సంజయ్.

ఇక్కడ ఉన్న ఆంధ్ర ఓటర్లను నమ్మించి ఓట్లు వేయించుకోవాలనేది సీఎం కేసీఆర్ ఎత్తుగడ అని.. ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో మళ్లీ ఏపీ, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడతారని మండిపడ్డారు. గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్‌ అవమానించలేదా? అంటూ పాత విషయాలు గుర్తు చేశారు.

Advertisement

విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయనీయమని అంటున్న కేసీఆర్.. తెలంగాణలో నిజాం చక్కెర పరిశ్రమను ఎందుకు పునరుద్ధరించటం లేదని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ వైఖరి ఏంటి? పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తానన్న కేసీఆర్.. మరి, తెలంగాణలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారా? అని నిలదీశారు.
రాష్ట్రంలో విద్యుత్‌ఛార్జీలు పెంచింది నిజం కాదా?
కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది నిజం కాదా?
ఏపీ సీఎంతో కుమ్మక్కై కేఆర్‌ఎంబీ సమావేశానికి కేసీఆర్‌ వెళ్లకపోవడం నిజం కాదా? అంటూ బండి సంజయ్ అన్నారు.

తెలంగాణ ఏర్పడక ముందు 18 లక్షల వ్యవసాయ బోర్లు ఉంటే..రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23 లక్షల బోర్ అయ్యాయన్నారు.

Advertisement

పాఠశాల విద్యలో తెలంగాణ 21వ స్థానంలో ఉందని.. నిరుద్యోగంలో తెలంగాణ 4వ స్థానంలో ఉందని.. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందని.. ముందు రాష్ట్ర సంగతి చూడాలని ఆ తర్వాత దేశం గురించి ఆలోచించవచ్చంటూ కేసీఆర్ కు కౌంటర్ వేశారు. యువతను బీజేపీకి దూరం చేసేందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×