// // Bandi Sanjay: 'బందిపోట్ల రాష్ట్ర సమితి'.. కేసీఆర్, జగన్ కలిసి దోపిడీ.. బండి ఆగ్రహం - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Bandi Sanjay: ‘బందిపోట్ల రాష్ట్ర సమితి’.. కేసీఆర్, జగన్ కలిసి దోపిడీ.. బండి ఆగ్రహం

Bandi Sanjay: ‘బందిపోట్ల రాష్ట్ర సమితి’.. కేసీఆర్, జగన్ కలిసి దోపిడీ.. బండి ఆగ్రహం
Advertisement

Bandi Sanjay: కరీంనగర్ గడ్డ.. బీజేపీ అడ్డా.. అంటూ ప్రజా గర్జన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. తెలంగాణను కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. డ్రగ్స్ దందా, లిక్కర్ దందా, గనుల దందా, ప్రాజెక్టుల దందాతో డబ్బులు పోగేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ డబ్బుతో బీఆర్ఎస్ అంటూ.. ఇక దేశాన్ని దోచుకునేందుకు బయటు దేరారని విమర్శించారు.

బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని.. బార్ అండ్ రెస్టారెంట్ సమితి అంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్. దేశాన్ని దోచుకోవడానికి తోడు దొంగలంతా ఒక్కటవుతున్నారని మండిపడ్డారు.

Advertisement

కేసీఆర్, జగన్ లు కలిసి రెండు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. దోచుకుందాం.. కమీషన్లు దాచుకుందాం.. అనే కాన్సెప్ట్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరస్కరిస్తే.. అక్కడ జై ఆంధ్ర.. ఇక్కడ జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటున్నారని విమర్శించారు బండ సంజయ్.

తెలంగాణ తల్లికి ద్రోహం చేసి.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారని తప్పుబట్టారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాలు అన్యాయానికి గురవుతున్నారని బండి సంజయ్ అన్నారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ బహిరంగ సభలో బండి సంజయ్ సింహ గర్జన చేశారు.

Advertisement

తనను ఎన్నో అవమానాలకు గురి చేశారని.. డిపాజిట్ రాదని హేళన చేశారంటూ.. బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అవమానాలకు భయపడేది లేదని.. ధర్మం కోసం యుద్ధం చేస్తామని తేల్చి చెప్పారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×