E-Paper
Advertisement

కొడుకు చేసిన తప్పుపై బండి సంజయ్ ఏమన్నారంటే..? షాకింగ్ కామెంట్స్

కొడుకు చేసిన తప్పుపై బండి సంజయ్ ఏమన్నారంటే..? షాకింగ్ కామెంట్స్
Advertisement

Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో కేంద్రమంత్రి బండి సంజయ్ భావోద్వేగంగా ప్రసంగించారు. గత 16 ఏళ్లుగా హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చే లక్ష్యంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నామని, హిందూ సమాజాన్ని చీల్చే శక్తులు పెరిగిపోయినందునే ‘జై శ్రీరామ్’ నినాదాన్ని బలంగా ఎత్తుకున్నామని ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానం మొత్తం కష్టాలతోనే సాగిందని, కానీ తాను ఎప్పుడూ దేనికీ భయపడలేదని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యంగా తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడుతూ ఆయన కొంత ఆవేదనకు గురయ్యారు. ‘ప్రజా జీవితంలో బిజీగా ఉండి నా కొడుకుకు కనీసం సమయం ఇవ్వలేకపోయాను, అది నేను చేసిన తప్పు’ అంటూనే.. ఒకవేళ తన కొడుకు నిజంగా తప్పు చేస్తే అసలు క్షమించే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. తన కొడుకును నేరస్థుడిగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఈ పరిణామాలతో తన భార్య తీవ్రమైన కుంగుబాటుకు (డిప్రెషన్) లోనైందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలేదని గుర్తు చేస్తూ.. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కుట్రలు పన్నుతున్న వారిని, పార్టీని ఇబ్బంది పెడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని బండి సంజయ్ హెచ్చరించారు. తన గుండె నిండా కాషాయ జెండా, తల మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని, కార్యకర్తలే తన కుటుంబమని పేర్కొన్నారు. కేవలం ఓట్ల కోసం కొన్ని పార్టీలు ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నాయని మండిపడుతూ.. హనుమాన్ వారసుడిగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.

Also Read: బాధితురాలికి న్యాయం జరగాల్సిందే.. బండి సంజయ్ కుమారుడి కేసుపై మంత్రి పొన్నం స్పష్టం!

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×