E-Paper
Advertisement

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!
Advertisement

Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: రాష్​ట్ర ప్రభుత్వం జెన్-జీలకు(21-30ఏళ్ళ వయసు) మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చెప్పడం కాదని, ఆచరణలో చూపాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు. రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి జెన్-జీ లకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలన్నారు. సీఎం వద్ద హోంశాఖ, విద్యా, మున్సిపల్ శాఖలు ఖాళీగానే ఉన్నాయని, వాటిని జెన్-జీలకు ఆ శాఖలు అప్పగించాలని డిమాండ్ చేశారు. సీఎం దృష్టిలో జెన్-జీ లంటే వీహెచ్, కేకే, కోదండ రెడ్డి అనుకుంటున్నారా అని ఎద్దేవాచేశారు. వృద్ధులకు, వయసు దాటిన పెద్దలకు యూత్ కోటాలో పదవులు ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటే కదా అని చురకలంటించారు. బీజేపీకి దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అని పేర్కొన్నారు. ఆ కోణంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని బండి వివరించారు.

బండి సంజయ్ మాట్లాడుతూ..

Advertisement

ఇదిలాఉండగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి బండి సంజయ్ ఆదివారం హాజరై మాట్లాడారు. ప్రధాని మోడీ పాలనలో రైల్వే రంగంలో నూతన శకం ఆరంభమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా రైల్వే రంగ అభివృద్ధికి దాదాపు రూ.23 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా రైల్వే లేన్ల నిర్మాణం, నూతన రైళ్లు, స్టేషన్ల ఆధునీకరణ పేరిట రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

30 రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులు..

Advertisement

ఇప్పటికే రూ.36 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసిన కేంద్రం మరో రూ.84,492 కోట్ల అంచనా మరో 30 రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణకు 3 బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని, అందుకోసం రూ.1.5 లక్షల కోట్లతో హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. మోడీ 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు రూ.13 లక్షల 9 వేల కోట్లు కేటాయించామని, కేవలం ఓఆర్ఆర్ సహా జాతీయ రహదారుల నిర్మాణం కోసమే రూ.1.74 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. లక్షలాది మంది కొమురవెల్లి మల్లన్న స్వామి భక్తుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించిందని బండి తెలిపారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు చెప్పారు.

ఇకపై దిగగానే మల్లన్న దర్శనానికి..

దేవుడి దగ్గరకు వెళ్లే దారి సులభమైతే.. భక్తి మరింత పెరుగుతుందని సామెత ఉందని ఆయన గుర్తుచేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇకపై రైలు దిగగానే మల్లన్న దగ్గరికి వచ్చేశామనే ఆత్మీయ అనుభూతి కలుగుతుందన్నారు. రైలు ఎక్కడికి వెళ్తే.. అక్కడ అభివృద్ధి జరుగుతుందని, ఈ రైల్వే స్టేషన్ ప్రారంభంతో భక్తులకే కాకుండా కొమురవెల్లి ప్రాంత రైతులకు, చిన్న వ్యాపారులకు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అధ్యాత్మిక పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని, ప్రత్యేకించి శివరాత్రి, జాతరల సమయంలో లక్షలాది మంది భక్తులకు ఈ రైల్వే సేవలు ఎంతో ఉపయోగపడతాయని బండి తెలిపారు.

రోడ్డు, రైల్వే, ఎయిర్ కనెక్టివిటీలకే ప్రాధాన్యత..

ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే రవాణా సౌకర్యాలు బాగుంటేనే సాధ్యమవుతుందని బండి తెలిపారు. అందుకే ప్రధాని మోడీ రోడ్డు, రైల్వే, ఎయిర్ కనెక్టివిటీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అందులో భాగంగా 12 ఏళ్లలో ట్రిపుల్ ఆర్(రీజనల్ రింగ్ రోడ్) తోసహా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.1 లక్షా 74 వేల 412 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో పౌర విమానయాన రంగ అభివృద్ధికి దాదాపు రూ.1073 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రైల్వేల అభివృద్ధి కోసం 12 ఏళ్లలో దాదాపు రూ.23 లక్షల కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు బండి వివరించారు.

రూ. 47.984 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు..

తెలంగాణ విషయానికొస్తే.. గతంలో యూపీఏ హయాంలో 2014న రూ.258 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే.. ప్రధాని మోడీ వచ్చాక తెలంగాణకు రైల్వే బడ్జెట్ 20 రెట్లు అధికంగా పెరిగిందన్నారు. ఈ ఏడాది తెలంగాణకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 12 ఏళ్లలో తెలంగాణలో రైల్వేల కోసం రూ.36,286 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్​టం చేశారు. మరో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 7 బుల్లెట్ రైళ్లను మంజూరు చేస్తే.. మోడీ తెలంగాణకు మూడు కేటాయించారన్నారు. అందులో హైదరాబాద్-బెంగళూర్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె హైస్పీడ్ రైల్ కారిడార్ ఉన్నాయన్నారు.

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్

వీటి నిర్మాణం కోసం రూ.1 లక్షా 50 వేల కోట్లను ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. వీటితోపాటు ఎంఎంటీసీ ఫేజ్ 2, ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతోసహా మరో 30 కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే జరుగుతున్నాయన్నారు. వీటి నిర్మాణం కోసం రూ.84,492 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు విస్తరించబోతున్నామని, అందుకోసం రూ.1122 కోట్లను ఖర్చు చేయబోతున్నట్లు సంజయ్ స్పష్టంచేశారు.

సిద్దిపేట.. కొత్తపల్లి రైల్వే మార్గం..

తెలంగాణకు 12 సంవత్సరాల్లో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాలు, 576 కిలోమీటర్ల డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రుప్లింగ్, బైపాస్ లైన్లు, 2,034 ట్రాక్ కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అలాగే మనోహరాబాద్-కొత్తపల్లి(సిద్దిపేట-కొత్తపల్లి) కొత్త రైల్వే మార్గం, కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్, ముద్‌ఖేడ్-మేడ్చల్ డబ్లింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ 12 ఏళ్లలో 627 కిలోమీటర్ల మార్గంలో 63 స్టేషన్లకు కవచ్ 3.2 అమలు చేసినట్లు బండి తెలిపారు. అన్‌మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించామన్నారు. 329 రోడ్డు అండర్ బ్రిడ్జీలు, 59 రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు, 58 ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు.

ప్రతిపక్షాలకు మంత్రి కౌంటర్..

రూ.521 కోట్లతో కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులు తుది దశకు చేరుకున్నాయని బండి సంజయ్ తెలిపారు. ఈ యూనిట్‌లో భవిష్యత్తులో నూతన తరం ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. తెలంగాణలో రూ.2,000 కోట్లకు పైగా వ్యయంతో 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలాఉండగా కొమురవెల్లి రైల్వే స్టేషన్ భవిష్యత్తులో అభివృద్ధికి చిరునామాగా నిలవాలని బండి కోరారు. 12 ఏళ్లలో కేంద్రం.. తెలంగాణ అభివృద్ధికి దాదాపు రూ.14 లక్షల కోట్లు కేటాయించిందని, ఇకనైనా ప్రతిపక్షాలు విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని బండి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Also Read: మడ అడవుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రికార్డు.. అటవీ శాఖకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×