E-Paper
Advertisement

Bandi Sanjay: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం.. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు : బండి సంజయ్

Bandi Sanjay: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం.. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు : బండి సంజయ్
Advertisement

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ బీజేపీ. చిన్న మీటింగ్‌కు కూడా అధిష్టానం నుంచి అగ్రనేతలను దింపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ వంటి దిగ్గజ నేతలు వరుసగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించి జనాలకు హామీల మీద హామీలు గుప్పించారు.

ఇక త్వరలోనే రాష్ట్రంలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఈ సభకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నేతలున్నారన్నారు. రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు 300 సీట్లు దాటిందని తెలిపారు.

Advertisement

తెలంగాణలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో బీజేపీని ఇంకా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్మమని వెల్లడించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×