E-Paper
Advertisement

Drunk And Driving Cases: న్యూ ఇయర్ వేళ మందుబాబుల జోరు.. హైదరాబాద్, తిరుపతిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

Drunk And Driving Cases: న్యూ ఇయర్ వేళ మందుబాబుల జోరు.. హైదరాబాద్, తిరుపతిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Advertisement

Drunk And Driving Cases: న్యూఇయర్ వేళ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు ఏ మాత్రం లెక్క చేయలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో కొత్త సంవత్సర వేడుకలు మొదలు కాకముందే మందుబాబులు దూకుడు ప్రదర్శించారు. ఫలితంగా పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదు అయ్యాయి.

న్యూ ఇయర్ వేళ మందుబాబుల జోరు

Advertisement

న్యూ ఇయర్ సందర్భంగా పదే పదే ప్రజలను అలర్ట్ చేశారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో తాగి డ్రైవింగ్ చేయవద్దని నగరవాసులను హెచ్చరించారు సీపీ సజ్జనార్. బుధవారం రోజంతా మార్నింగ్‌లు ఇచ్చారు. కానీ మందుబాబులు అవేమీ పట్టించుకోలేదు. లిక్కర్ అమ్మకాలు జోరుకావడంతో ముందుగా పోలీసులు అలర్ట్ అయ్యారు.

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు.  బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి గురువారం తెల్లవారుజామున వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 10 వేల మంది మొహరించారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు.

Advertisement

హైదరాబాద్, తిరుపతిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు నమోదు అయ్యాయి. పట్టుబడిన వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది,  మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో 605 మందిపై కేసులు నమోదు అయ్యాయి.

వాటిని నుంచి వివరాలు వస్తే భారీగా కేసులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఎస్ఆర్ నగర్ , యూసఫ్‌గూడ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. గురువారం అర్ధరాత్రి రెండున్నర గంటల వరకు తనిఖీలు చేపట్టారు పోలీసు. అక్కడ దాదాపు 70కి పైగా కేసులు నమోదు అయ్యాయి.

ALSO READ:  ప్రపంచవ్యాప్తంగా అంబరాన్ని తాకిన న్యూ ఇయర్ వేడుకలు

ఇక ఏపీ విషయానికి వద్దాం. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. తిరుపతిలో రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. 60 కేసులు నమోదు అయ్యాయి. అయితే గతేడాది కంటే 10 కేసులు తక్కువని చెబుతున్నారు అధికారులు.

ఎస్‌పీ సుబ్బరాయుడి, డిఎస్‌పి భక్తవతల్సం ఆద్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. అటు విజయవాడ, విశాఖలో కూడా భారీగా డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్టు పోలీసులు చెబుతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు కాసేట్లో వెల్లడి కానున్నాయి.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×