E-Paper
Advertisement

Court Room Drama OTT : కుప్పలు తెప్పలుగా వలస పిల్లల మిస్సింగ్ కేసులు… ఈ మిస్టరీకి మైండ్ బ్లాక్… మిస్సవ్వకుండా చూడాల్సిన కోర్టు రూమ్ డ్రామా

Court Room Drama OTT : కుప్పలు తెప్పలుగా వలస పిల్లల మిస్సింగ్ కేసులు… ఈ మిస్టరీకి మైండ్ బ్లాక్… మిస్సవ్వకుండా చూడాల్సిన కోర్టు రూమ్ డ్రామా
Advertisement

Court Room Drama OTT : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కోర్టు రూమ్ డ్రామాల హడావిడి పెరిగిపోయింది. కోర్టులో జరిగే వాదన, ప్రతివాదనలు… సాక్ష్యాలు, వాటిని తారుమారు చేసే మతలబు, లాయర్ల చాకచక్యం, వాళ్ళు వాదించే కేసులు… వీటి ఆధారంగా తెరకెక్కే సినిమాలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? మూవీ పేరేంటి? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో అందుబాటులో

2021లో విడుదలైన హిందీ లీగల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘నెయిల్ పాలిష్’ (Nail Polish). భార్గవ కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో సిద్ధార్థ్ జైసింగ్ అనే పాత్రలో డిఫెన్స్ లాయర్ గా కన్పిస్తారు. మానవ్ కౌల్ వీర్ సింగ్ అనే అక్యూజ్డ్ రోల్ పోషించారు. ఆనంద్ తివారీ అమిత్ కుమార్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, రజిత్ కపూర్ జడ్జి గా, మధూ జడ్జి వైఫ్ గా నటించారు. 2 గంటల 8 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా 2021 జనవరి 1 నుంచి జీ5 (ZEE5)లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయింది. IMDbలో 7.2 రేటింగ్ ఉన్న ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది.

Advertisement

Read Also :  ఓటీటీలోకి భారతదేశం చంద్రునిపైకి చేసిన చారిత్రాత్మక ప్రయాణం… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

స్టోరీలోకి వెళ్తే…

కథ మొత్తం హై-ప్రొఫైల్ కోర్ట్ కేసు చుట్టూనే సాగుతుంది. వీర్ సింగ్ (మానవ్ కౌల్) అనే వ్యక్తి ఫేమస్ సోషల్ యాక్టివిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. కానీ నిజానికి అతను ఒక ఆర్మీ ఆఫీసర్. అంతేకాదు క్రికెట్ కోచ్ కూడా. అయితే అతనిపై వలస వచ్చిన చిన్న పిల్లలను రేప్ చేసి, మర్డర్ చేశాడనే ఆరోపణలు ఉంటాయి. మొత్తం 38 మంది చిల్డ్రన్ మర్డర్స్‌ లో ఇతనే మెయిన్ సస్పెక్ట్. అంతేకాదు అతనికి వ్యతిరేకంగా ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ ఎవిడెన్స్ లిస్ట్ లో ఫోరెన్సిక్ ప్రూఫ్, విట్నెస్ వంటివి ఉంటాయి. మరోవైపు సిద్ధార్థ్ జైసింగ్ (అర్జున్ రాంపాల్) అనే హై-ప్రొఫైల్ డిఫెన్స్ లాయర్ ఈ కేసును తీసుకుంటాడు. కానీ అంతకంటే ముందే ఈ కేసును వాదించడానికి రాజ్యసభ సీట్ కావాలని డీల్ కుదుర్చుకుంటాడు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ కుమార్ (ఆనంద్ తివారీ) వీర్ ‌ను గిల్టీ అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు.

Advertisement

కోర్ట్ ట్రయల్ సాగుతుండగానే జైల్లో వీర్ పై అటాక్ జరుగుతుంది. దీంతో అతనికి మెమరీ లాస్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా అతని ఒరిజినాలిటీ కాకుండా సెకండ్ పర్సనాలిటీ అనే సమస్య మొదలవుతుంది. వీర్ తనను తాను చారు రైనా అనే మిడిల్ ఏజ్ కాశ్మీరీ మహిళ అనుకుంటాడు. చారు నెయిల్ పాలిష్ ఆడగడంతో అక్కడి నుంచే మూవీ టైటిల్ వస్తుంది. వీర్ ఇప్పుడు చారులాగా బిహేవ్ చేస్తాడు. అతను అమ్మాయిలా బిహేవ్ చేయడమే కాదు వాయిస్ కూడా మారిపోతుంది. అయితే సైకియాట్రిస్ట్ అతన్ని హిప్నటైజ్ చేసి చారు గత స్టోరీ తెలుసుకుంటారు. అసలు చారు ఎవరు? ఆమెతో వీర్ కు ఉన్న లింకు ఏంటి ? చివరకు ఏమైంది ? అన్నది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. సైకలాజికల్ థ్రిల్లర్ ప్రియులు మైండ్ గేమ్స్ తో మెంటలెక్కించే ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×