E-Paper
Advertisement

Aliabad Budget: అలియాబాద్ అభివృద్ధికి 10 కోట్ల వార్షిక బడ్జెట్..!

Aliabad Budget: అలియాబాద్ అభివృద్ధికి 10 కోట్ల వార్షిక బడ్జెట్..!
Advertisement

Aliabad Budget: స్వేచ్ఛ బ్యూరో: అలియాబాద్ పురపాలక సంఘం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను సోమవారం ఆమోదించింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అలియాబాద్ మున్సిపాలిటీని దశలవారీగా అభివృద్ధి చేయడానికి కౌన్సిలర్లు సమిష్టిగా పనిచేయాలని కోరారు. సుమారు రూ.10 కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌ను సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు.

Also Read: పార్లమెంటులో తెలంగాణ క్రీడా నినాదం.. స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాయం చేయండి, ఎంపీ చామల డిమాండ్

రూ.9.62 కోట్లు..

Advertisement

మున్సిపాలిటీకి ఇంటి పన్నులు, భవన అనుమతులు, లేఅవుట్ ఫీజులు తదితరాల ద్వారా రూ.10.20 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. వ్యయంగా సిబ్బంది వేతనాలు, శానిటేషన్, కరెంట్ ఛార్జీలు, గ్రీన్ బడ్జెట్, నిర్వహణ పనులు, అభివృద్ధి పనులకు కలిపి రూ.9.62 కోట్లు కేటాయించారు. సిమెంట్ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం బడ్జెట్‌లో రూ.58 లక్షలు మిగులు నిల్వగా ఉంటాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కమిషనర్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ కన్రెడ్డి మాలతి, కౌన్సిలర్లు, అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: ఏసీబీ వలలో చిక్కిన తిమ్మాజీపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×