E-Paper
Advertisement

భార్యాభర్తలు ఈ విషయాలు దాచారో.. మీ కాపురం కొంపకొల్లేరే!

భార్యాభర్తలు ఈ విషయాలు దాచారో.. మీ కాపురం కొంపకొల్లేరే!
Advertisement

 Marriage Advice: మీ భర్తకి తెలీకుండా ఏమైనా ప్లాన్స్ వేస్తున్నారా ? మీ భార్యకి తెలీకుండా ఏమైనా దాస్తున్నారా.? ఇద్దరూ ఒకరితో ఒకరు ‘ప్రైవసీ’ పేరుతో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారా? అలా అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే. అవును ..ఎందుకంటే ఆ దాపరికం అంటే అదో స్లో పాయిజన్ లాంటిది. ఏ మాత్రం అలర్ట్ అవ్వకపోయినా మీ బందాన్ని అది తినేయడం ఖాయం. మరి ఏ విషయాలని అస్సలు దాచకూడదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారో ఒకసారి చూసేద్దాం.

ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అబద్దాలు

Advertisement

ముఖ్యంగా పెళ్లి అవ్వగానే చాలా మంది చేసే తప్పు ఏంటో తెలుసా ..పెళ్ళికి ముందు తమ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అబద్దాలు చెప్పడం.చేసిన అప్పుల గురించి ఏమనుకుంటారనో,తెలిస్తే చులకన అవతారనో,లేక తెలిస్తే గొడవ అవుతుందేమో అని నిజాన్ని దాటేసి అబద్దాలకి పని చెబుతారు.కానీ ఒక రోజు, రెండు రోజులు,లేదా రెండు నెలలు అబద్దాలతో దాటేయగలం, కానీ ఆతర్వాతై అసలు నిజం తెలియాల్సిందేగా.తెలిసిన రోజు అంతకన్నా పెద్ద గొడవ అయిపోతుందన్న లాజిక్ ఎందుకు మర్చిపోతారు.సో ..అసలు నిజం చెప్పెయ్యండి, ఉన్నది ఉన్నట్లు పంచుకోండి.. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? అప్పులు ఎన్ని? అనేది ఓపెన్‌గా మాట్లాడేయండి .అప్పుడే కలిసి గట్టెక్కగలరు..

also read:కిరణ్ అబ్బవరం..’నెక్స్ట్ లెవల్’ ప్లానా లేక కెరీర్ క్లోజింగ్ సీనా?

Advertisement

ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉన్నాయా?

ఇక మీకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉన్నాయా? భయాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా మందులు వాడుతున్నా లేదా ఏదైనా వింత అలర్జీలు ఉన్నా అస్సలు దాచకుండా మీ పార్ట్నర్‌కి చెప్పండి. ఎందుకంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది వారే కదా.

మీ లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు ఇన్ సెక్యూరిటీ ఉందా ?

ఇక మీ లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు ఇన్ సెక్యూరిటీగా అనిపించినా, లేక ఎవరితోనైనా క్లోజ్‌గా ఉంటున్నారని అనుమానం కలిగినా మౌనంగా ఉండి మనసును ముక్కలు చేసుకొని తెగ బాధ పడిపోకండి.మనసు విప్పి మాట్లాడితేనే అసలు విషయాలు తెలిసి అపార్థాలు తొలగిపోతాయి. ఎందుకంటే మౌనం కంటే మాటే మీ బంధాన్ని కాపాడుతుంది.

అలవాట్లు ఒకరికి తెలీడం చాలా ముఖ్యం

ఇక దాచకూడని మరో ముఖ్య విషయం అలవాట్లు. ఒకరి అలవాట్లు ఒకరికి తెలీడం చాలా ముఖ్యం.మీకు టీవీ చూడటం ఇష్టం కావచ్చు, మీ వారికి బయట నడవడం సరదా కావచ్చు. ఇలాంటి చిన్న చిన్న తేడాలే తర్వాత పెద్ద యుద్ధాలకు దారితీస్తాయి.సో మీ కెరీర్ ప్లాన్స్, పిల్లల గురించి ఆలోచనలు,మీ అలవాట్లు.. ఇలా ప్రతిదీ పెళ్లికి ముందో లేకపెళ్లైన కొత్తలోనే కలిసి చర్చించుకోవాలి. లేదంటే “నువ్వు ఇలాంటి వాడివి అని ,అలాంటి దానివి అని నాకు తెలియదు” అనే డైలాగులు కామన్ అయిపోతాయి.

మనసు విప్పి మాట్లాడండి. బందాన్ని బలంగా చేసుకోండి

ఇకపోతే మీరు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారు? మీగోల్స్ ఏంటి? అనేది లైఫ్ పార్ట్ నర్ తో షేర్ చేసుకోండి.అలా కాకుండా మీరే సొంతంగా డిసీషన్స్ తీసుకుంటే తర్వాత చిక్కుల్లో పడొచ్చు.సో మనసు విప్పి మాట్లాడండి.బందాన్ని బలంగా చేసుకోండి !

also read:మల్టీస్టారర్ అంటే ముచ్చట కాదు గురూ .. పక్కా ‘బిజినెస్ కాలిక్యులేషన్’!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×