E-Paper
Advertisement

పదేళ్లు ఏం పీకారని మాట్లాడుతున్నావ్? రేవంత్ జోలికొస్తే ఊరుకోం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి మాస్ వార్నింగ్!

పదేళ్లు ఏం పీకారని మాట్లాడుతున్నావ్? రేవంత్ జోలికొస్తే ఊరుకోం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి మాస్ వార్నింగ్!
Advertisement

Adluri Laxman: జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్స్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు.

సీఎంను ఏకవచనంతో పిలిస్తే ఊరుకోం

Advertisement

మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. ‘గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్‌ను ప్రతిపక్ష నేతలు ఎప్పుడైనా ఇంత అవమానకరంగా మాట్లాడారా?’ అని ఆయన ప్రశ్నించారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే బీఆర్ఎస్ నేతలు ఆగం అవుతున్నారని ఎద్దేవా చేశారు.

ముందు మీ కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకో..

Advertisement

కేటీఆర్‌కు వేరే వాళ్లను విమర్శించే అర్హత లేదని, ముందు తన సొంత కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని మంత్రి సూచించారు. జైలు నుంచి వచ్చిన తన సోదరి కవిత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శిస్తే సహించేది లేదని, ఏది పడితే అది మాట్లాడితే కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లకు వచ్చి మరీ జవాబు చెప్తామని హెచ్చరించారు. పదేళ్ల పాలనలో నువ్వు తెలంగాణకు ఏం చేశావో దమ్ముంటే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

2029లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే..

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజాపాలన’ ద్వారా ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా పని చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కొందరు నాయకులు మార్పు కావాలని మాట్లాడుతున్నారని, సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ తాము అందిస్తున్న పాలన నచ్చకే మార్పు కోరుతున్నారా అని ప్రశ్నించారు. రానున్న 2029 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ భారీ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: ఐఏఎస్ పిల్లలకూ రిజర్వేషనా? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల వెనుకున్న అసలు కథ ఇదే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×