E-Paper
Advertisement

గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!
Advertisement

Adivasi Tourism: స్వేచ్ఛ బ్యూరో: ఆదివాసీ బిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా, వారిలో విజ్ఞాన కాంతులు నింపాలన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న ఆలోచన ఆచరణలోకి రానుంది. గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. “మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తాను” అని హామీ ఇచ్చారు. తన ఆలోచనల నుంచి పుట్టిన వినూత్న కార్యక్రమానికి ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ పేరుతో కార్యరూపం దాల్చనుంది.

సుమారు 650 మంది

ఈ నెల 22న (బుధవారం) ఉదయం 6 గంటలకు ఉట్నూరు మండలం గొండు‌గూడలో జెండా ఊపి ఈ విజ్ఞాన యాత్రను మంత్రి స్వయంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేవలం పర్యాటక ప్రదేశాలను చూడటమే కాకుండా, ఆదివాసీలు ప్రపంచ పోకడలను, ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వారసత్వాన్ని దగ్గరగా గమనించాలన్నది మంత్రి ప్రధాన సంకల్పం. వారి ఆలోచనల నుంచి పుట్టిన ఈ ప్రత్యేక విజ్ఞాన యాత్రలో ఉట్నూరు ప్రాంతానికి చెందిన సుమారు 650 మంది ఆదివాసీలు పాల్గొంటున్నారు. ఆదివాసీల సంస్కృతికి – నగర నాగరికతకు మధ్య వారధిని నిర్మించాలన్న మంత్రి ఆకాంక్ష ఈ కార్యక్రమం ద్వారా నెరవేరనుంది.

Advertisement

Also Read: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నూనె ధరలు.. అసలు కారణం ఇదే!

యాత్ర సాగనుందిలా..

ఈ విజ్ఞాన యాత్రను మొత్తం మూడు విడతలుగా రూపకల్పన చేశారు. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు సాగే ఈ పర్యటనలో ఒక్కో బ్యాచ్‌కు 200 నుంచి 250 మంది చొప్పున మూడు బ్యాచ్‌లుగా హైదరాబాద్‌ను సందర్శిస్తారు. వీరి సౌకర్యార్థం మంత్రి ఆదేశాల మేరకు 5 ప్రత్యేక ఏసీ బస్సులను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు.

అతిథి మర్యాదల్లో లోటు లేకుండా..

Advertisement

యాత్రకు వచ్చే అడవి బిడ్డలకు బస, భోజన వసతులలో ఎటువంటి లోటు రాకుండా చూడాలని మంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. చారిత్రక కట్టడం తారామతి బరాదరిలో వీరికి బస ఏర్పాటు చేయడంతో పాటు, ఆత్మీయ ఆతిథ్యం అందించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మారుమూల అడవుల నుంచి వచ్చే ఆదివాసీలకు ఈ రెండు రోజుల పర్యటన ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. పర్యాటక శాఖ, ఆదిలాబాద్ కలెక్టర్, ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

ALSO Read: వివాదంలో అంబానీ..ముంబై ఇండియ‌న్స్ కోచ్ గా మహ్మద్ అమీర్ ?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×