E-Paper
Advertisement

Vemulawada Temple : రాజన్న సన్నిధిలో అక్రమార్కుల పుట్ట.. వేములవాడ ఆలయ సిబ్బందిపై ఏసీబీ నిఘా..

Vemulawada Temple : రాజన్న సన్నిధిలో అక్రమార్కుల పుట్ట.. వేములవాడ ఆలయ సిబ్బందిపై ఏసీబీ నిఘా..
Advertisement

Vemulawada Temple : పవిత్రంగా భావించే దేవుడి సన్నిధిలో అక్రమార్కులెక్కువయ్యారు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావించే వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర, యాదగిరిగుట్ట, కొమురవెల్లిలో ఆలయ సిబ్బందిపై ఆరోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు నిఘా పెంచారు. ముఖ్యంగా వేములవాడ రాజన్న ఆలయంలో 30 మంది ఉద్యోగులపై ఆరోపణలు తారస్థాయికి చేరగా.. వారిపై అధికారులు నజర్ పెట్టారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉద్యోగుల్లో భయం నెలకొంది.

ఇప్పటికే కొందరు ఉద్యోగులు లాంగ్ లీవ్‌లో వెళ్లిపోయారు. AEO నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్న 6A కేటగిరీ దేవాలయాల్లో పనిచేస్తున్న 14 మంది ఏఈవోల బదిలీలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర, యాదగిరిగుట్ట, కొమురవెల్లి అధికారులకు స్థానచలనం తప్పేట్టు లేదు.

Advertisement

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×