E-Paper
Advertisement

ACB Raids: మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం

ACB Raids: మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం
Advertisement

ACB Raids: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడారు.

ప్రాథమిక విచారణలో..

శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామన్నారు.

Advertisement

Also read: జగ్గూభాయ్ డబ్బింగ్ వీడియో వైరల్.. అప్పల సూరిగా థియేటర్లలో పూనకాలే!

2024లో కూడా..

ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్ డి ఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, 2024లో కూడా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్‌తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Also Read: ప‌వ‌న్ అంత‌రంగాన్ని ప‌ట్టించిన త‌మిళ రాజ‌కీయాలు..! వెంటాడుతున్న విజ‌య్ సీఎం.. ఇన్ఫిరియారిటీ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×