E-Paper
Advertisement

ఒక్క ఛార్జ్‌ తో 579 కి.మీ ప్రయాణం.. భారత్ లో హైరేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!

ఒక్క ఛార్జ్‌ తో 579 కి.మీ ప్రయాణం.. భారత్ లో హైరేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!
Advertisement

High Range Electric Bikes 2026: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్స్ వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సిటీ ప్రయాణాలకు మాత్రమే పరిమితమైన ఎలక్ట్రిక్ వాహనాలు, ఇప్పుడు లాంగ్ రైడ్స్, టూరింగ్‌కు కూడా అనువుగా మారాయి. ముఖ్యంగా పెద్ద బ్యాటరీలు, శక్తివంతమైన మోటార్లు రావడంతో ఒకే ఛార్జ్‌ పై వందల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం పెరిగింది. దేశంలో కూడా హై రేంజ్ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం భారత్ లో ఎక్కువ రేంజ్ ఇచ్చే టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ అల్ట్రావయోలెట్ F77

భారత మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న మోడళ్లలో అల్ట్రావయోలెట్ F77 ఒకటి. ఈ స్పోర్టీ ఎలక్ట్రిక్ బైక్ ధర సుమారు రూ.3.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ప్రకారం, ఈ బైక్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 211 నుంచి 323 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని డిజైన్, ఫీచర్లు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.

⦿ ఓలా రోడ్‌స్టర్ ప్రో

Advertisement

ఇక ఓలా రోడ్‌స్టర్ ప్రో కూడా భారీ రేంజ్‌ తో మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర సుమారు రూ.2 లక్షలు. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి ఈ బైక్ 316 నుంచి 579 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సుదూర ప్రయాణాలు చేసే వారికి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ కోమాకి రేంజర్

ఈ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ ధర సుమారు రూ.1.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ 160 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. సాఫ్ట్ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ కావాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

⦿ సింపుల్ వన్ అల్ట్రా

Advertisement

ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ IDC రేంజ్ ప్రకారం, ఇది ఒక్క ఛార్జ్‌ తో 400 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.

పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎక్కువ రేంజ్ ఇచ్చే మోడళ్లు రావడంతో వినియోగదారులు ఈవీ బైక్స్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలు అందుబాటులోకి వస్తే, ఎలక్ట్రిక్ బైక్‌లు సాధారణ పెట్రోల్ వాహనాలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా చెప్పుకోవచ్చు.

Read Also: సింగిల్ ఛార్జ్ తో 830 కి.మీ రేంజ్.. ఇది ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×