E-Paper
Advertisement

ACB Raids: బల్దియా ఆఫీస్​ పై ఏసీబీ రెయిడ్స్.. వరుస దాడులతో జంకుతున్న అధికారులు

ACB Raids: బల్దియా ఆఫీస్​ పై ఏసీబీ రెయిడ్స్.. వరుస దాడులతో జంకుతున్న అధికారులు
Advertisement

ACB Raids: వరుస దాడుతో ఏసీబీ అధికారులు హడలెత్తిస్తున్నారు. దుండిగల్ GHMC సర్కిల్ కార్యాలయంలో ACB దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్య అధికారి అయిన కమిషనర్ వెంకటేశ్వర్లు ఛాంబర్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్దమొత్తంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయాని అధికారులు తెలిపారు. కార్యాలయంలోకి ఎవరిని రానియ్యకుండా పలుకీలక మైన ఫైల్లను తనికీ చేస్తేున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

భారీ ఎత్తున లంచాలు

కుత్భుల్లాపూర్ మున్సిపల్ జోనల్​ ఆఫీస్‌లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్టుగా అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు నిన్న దాడులు జరిపారు. విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. వేర్వేరు పనుల మీద కార్యాలయానికి వచ్చే ప్రజలు, కాంట్రాక్టర్ల నుంచి సిబ్బందిలో కొందరు భారీ ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే కార్యాలయంపై దాడి జరిపిన ఏసీబీ అధికారుల బృందం భవన నిర్మాణ అనుమతులు, అక్రమాల కట్టడాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.

Advertisement

Also Read: YouTube: యూట్యూబ్ సేవలకు అంతరాయం.. పరిశీలిస్తున్నామన్న నిర్వాహకులు, టెన్షన్ పడిన యూజర్లు

బిల్లుల విషయంలో..

పన్ను వసూళ్లు, మ్యూటేషన్లతోపాటు రెవెన్యూ సంబంధిత ఫైళ్లను తనిఖీ చేశారు. జరిగిన అభివృద్ధిపనులకు సంబంధించి కాంట్రాటర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో సిబ్బంది ఎవరైనా చేతివాటాన్ని ప్రదర్శించారా? అన్న కోణంలో విచారణ జరిపారు. తనిఖీలు జరిగినంత సేపు ఆఫీస్ లోపలికి ఎవ్వరినీ అనుమతించ లేదు. కాగా, సోదాల్లో పలు కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు సీజ్​ చేసినట్టుగా తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Advertisement

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×