E-Paper
Advertisement

బయట కొంటే ₹1800.. ఇక్కడ ₹1350 మాత్రమే! డీఏపీ బస్తాల కోసం ఎగబడ్డ రైతులు.. ఏం జరిగిందంటే?

బయట కొంటే ₹1800.. ఇక్కడ ₹1350 మాత్రమే! డీఏపీ బస్తాల కోసం ఎగబడ్డ రైతులు.. ఏం జరిగిందంటే?
Advertisement

DAP Bags: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే చాలు.. రైతులకు పెట్టుబడుల తిప్పలు, ఎరువుల కొరత ముచ్చెమటలు పోడిస్తుంటాయి. ప్రస్తుత వానాకాలం సాగు పనుల జోరు పెరగడంతో మార్కెట్‌లో ఎరువులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో డీఏపీ (DAP) బస్తాల కోసం అన్నదాతలు గురువారం తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయం వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టి నిల్చున్నారు.

ధరల వ్యత్యాసమే ప్రధాన కారణం..
రైతులు ఈ స్థాయిలో ఎగబడటానికి ప్రధాన కారణం బహిరంగ మార్కెట్‌కు, ప్రభుత్వ సొసైటీకి మధ్య ఉన్న ధరల వ్యత్యాసమే. బయట ప్రైవేట్ దుకాణాల్లో ఒక డీఏపీ బస్తా ధర ఏకంగా ₹1800 పలుకుతుండగా, రామాయంపేట పీఏసీఎస్ సొసైటీలో మాత్రం కేవలం ₹1350 లకే అందిస్తున్నారు. అంటే ఒక్కో బస్తాపై రైతుకు దాదాపు ₹450 వరకు ఆదా అవుతోంది. పెట్టుబడి ఖర్చులు భారంగా మారిన ఈ రోజుల్లో, ఇంత పెద్ద మొత్తంలో రాయితీ లభిస్తుండటంతో.. చిన్న, సన్నకారు రైతులు తెల్లవారుజామున 6 గంటల నుంచే సొసైటీ గేట్ల వద్ద పడిగాపులు కాశారు.

Advertisement

రంగంలోకి పోలీస్ పహారా..
సమయం గడుస్తున్న కొద్దీ వందలాది మంది రైతులు సొసైటీ వద్దకు చేరుకోవడంతో అక్కడ తీవ్ర రద్దీ నెలకొంది. ఎరువుల బస్తాల కోసం తోపులాట జరిగే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా స్థానిక పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. రైతులను వరుస క్రమంలో నిలబెట్టి, పోలీస్ పహారా మధ్య, సహకార సంఘం అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డీఏపీ బస్తాల పంపిణీ ప్రక్రియను శాంతియుతంగా కొనసాగించారు. ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకాల ఆధారంగా ఎరువులను కేటాయించారు.

Also Read: స్పెయిన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. 12 మంది దుర్మరణం

Advertisement

మరిన్ని నిల్వలు పెంచాలని రైతుల డిమాండ్
సొసైటీ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన ఎరువులు అందుతుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా పెంచాలని కోరుతున్నారు. వానాకాలం పంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున డీఏపీ అవసరం ప్రతి రైతుకూ ఉంటుందని, అందరికీ సరిపడా నిల్వలను ముందే సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డుకట్ట వేసి, ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగం కోరుతోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×