E-Paper
Advertisement

Wanindu Hasaranga : 7/19.. శ్రీలంక స్పిన్నర్ హసరంగ రికార్డ్..

Wanindu Hasaranga : 7/19.. శ్రీలంక స్పిన్నర్ హసరంగ రికార్డ్..
Advertisement
Wanindu Hasaranga

Wanindu Hasaranga : జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ స్పిన్ మాయాజాలంతో అద్భుతం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7 వికెట్లు తీయడంతో జింబాబ్వే 96 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే హసరంగా 5.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి, 19 పరుగులు ఇచ్చాడు. అంతే కాదు వన్డే మ్యాచ్ లో, 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 15వ బౌలర్ గా రికార్డులకి ఎక్కాడు.

హసరంగ కన్నా ముందు శ్రీలంకకే చెందిన చమిందావాస్ ఉన్నాడు. తను కూడా జింబాబ్వే మీద 2001లో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంకకే చెందిన ముత్తయ్య మురళీధరన్ 2000లో భారత్ పై 7 వికెట్లు తీశాడు. కాకపోతే తను 30 పరుగులు ఇచ్చాడు. వీరి తర్వాత ఆ ఘనత సాధించిన మూడో శ్రీలంక బౌలర్ గా హసరంగ రికార్డ్ సృష్టించాడు.

Advertisement

జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి వన్ డే వర్షార్పణమైంది. రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గిన తర్వాత అంపైర్లు మ్యాచ్ ని 27 ఓవర్లకు కుదించారు. దీంతో జింబాబ్వే టీ 20 తరహాలో దూకుడుగా ఆడి, వికెట్లు పోగొట్టుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 22.5 ఓవర్లలో 96 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత 97పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రం కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది.

Advertisement

వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత ఐసీసీ ఆగ్రహానికి గురైన శ్రీలంక మళ్లీ చచ్చీచెడి అంతర్జాతీయ మ్యాచ్ లకు అనుమతి తెచ్చుకుంది. ఈ క్రమంలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ తో తను మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. గాయంతో క్రికెట్ కి దూరమైన స్పిన్నర్ హసరంగ  మళ్లీ జట్టులోకి వచ్చి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అంతేకాదు చరిత్రలో నిలిచిపోయేలా బౌలింగ్ చేశాడు. తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×