E-Paper
Advertisement

Virat Kohli Instagram: ఫ్యాన్స్ కు బిగ్ షాక్..ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విరాట్ కోహ్లీ ఔట్ !

Virat Kohli Instagram: ఫ్యాన్స్ కు బిగ్ షాక్..ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విరాట్ కోహ్లీ ఔట్ !
Advertisement

Virat Kohli Instagram: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన అభిమానులందరికీ షాక్ ఇస్తూ, విరాట్ కోహ్లీ త‌న‌ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టీవేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కోట్లలో ఫాలోవర్స్ కలిగి ఉన్న విరాట్ కోహ్లీ, ఇన్ స్టాగ్రామ్ కు గుడ్ బై చెప్పాడని అంటున్నారు. విరాట్ కోహ్లీ అకౌంట్ లో యూజర్ నాట్ ఫౌండ్ అని సెర్చ్ చేస్తే చూపిస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నిసార్లు టైప్ చేసి చూసినా కూడా విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ (Virat Kohli Instagram ) అకౌంట్ డీటెయిల్స్‌ దొరకడం లేదు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను విరాట్ కోహ్లీ కావాలనే టెంపర్ వరీగా డీయాక్టివేట్ చేశాడా ? లేదా మొత్తానికే ఇన్ స్టాగ్రామ్ కు గుడ్ బై చెప్పాడా ? ( Virat Kohli quits Instagram) అని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు విరాట్ కోహ్లీ అకౌంట్ కు ఏమైంది ? అంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. దీంతో విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ గురించే సోషల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ జ‌రుగుతోంది.

Also Read: Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విరాట్ కోహ్లీ ఔట్ !

Advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒంటి చేత్తో టీమిండియా కు ఎన్నో విజయాలు అందించారు విరాట్ కోహ్లీ. కెప్టెన్ గా కూడా మెరిశారు. అయితే ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ, మ్యాచ్ లు ఉన్నప్పుడు మాత్రమే ఇండియాకు వచ్చి మళ్లీ లండన్ వెళ్లిపోతున్నారు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతని యాక్టివిటీస్ చూసి సంబరపడిపోయేవారు.

అయితే ఇకపై ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విరాట్ కోహ్లీ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. తన అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకున్నట్లే తెలుస్తోంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇండియాలో ప్రశాంతత లేదని లండన్ వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. ప్రశాంతమైన వాతావరణాన్ని గడపాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ ను డీయాక్టివేట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇకపై విరాట్ కోహ్లీ కి సంబంధించిన అప్డేట్లు ఎలా తెలుసుకోవాలి? అంటూ ఉలిక్కిపడుతున్నారు.

విరాట్ కోహ్లీ ఫాలోవర్స్ ఎంత? ఒక పోస్ట్ కు ఎంత తీసుకుంటున్నాడు

Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌ లో విరాట్ కోహ్లీకి ఉన్నంత ఫాలోయింగ్ ఏ క్రికెటర్ కు లేదు. అతనికి 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఇంస్టాగ్రామ్ లో ఉన్నారు. అంటే విరాట్ కోహ్లీకి 27 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మెస్సి, రోనాల్డో లాంటి దిగ్గజ ఆటగాళ్ల తర్వాత ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నది విరాట్ కోహ్లీకే. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్టుకు రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు విరాట్ కోహ్లీ ఛార్జ్ చేస్తున్నాడు.

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×