E-Paper
Advertisement

Dashing Openers:- పేరుకు డాషింగ్ ఓపెనర్లు… స్ట్రైక్ రేట్ మాత్రం దారుణం

Dashing Openers:- పేరుకు డాషింగ్ ఓపెనర్లు… స్ట్రైక్ రేట్ మాత్రం దారుణం
Advertisement

Dashing Openers:- ఐపీఎల్ అంటేనే ధనాధన్. ఆ కొట్టుడు వల్లే ఐపీఎల్‌కు అంత క్రేజ్. వచ్చామా.. దంచి కొట్టామా.. వెళ్లామా. ఈ ఫార్మాట్‌లో మెయిన్ ఫార్ములా ఇదే. ఆడేదే 20 ఓవర్లు, ఆడాల్సిన ప్లేయర్లు 11 మంది. సో, స్ట్రైక్ రేట్ ఏ రేంజ్‌లో ఉండాలి. ముఖ్యంగా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ దడదడలాడించాలి. కాని, కొందరు మాత్రం లో స్ట్రైక్ రేట్‌తో అభిమానులను, అటు మేనేజ్‌మెంట్‌ను నిరాశపరుస్తున్నారు.

1. డేవిడ్ వార్నర్
ఈ సీజన్‌లో బాగా విమర్శలు ఎదుర్కొంటున్న ప్లేయర్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఈ సీజన్ ఐపీఎల్‌లో టోటల్ రన్స్‌లో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ.. స్ట్రైక్ రేట్‌లో మాత్రం ఆ స్థాయికి తగ్గట్టు ఆడడం లేదు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ స్ట్రైక్ రేట్ 116. నిజానికి డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్లకు ఉండాల్సిన స్ట్రైక్ రేట్ కాదిది.

Advertisement

2. కేఎల్ రాహుల్
ఈ సీజన్‌లో ఎక్కువ డిస్కషన్ జరుగుతున్నది కేఎల్ రాహుల్ పైనే. లాస్ట్ టీ20 మ్యాచ్‌లలోనూ పెద్దగా ఆడింది లేదు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అదే వరస. ఎంత దారుణంగా ఆడుతున్నాడంటే.. లాస్ట్ ఐదు మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ చేసిన పరుగులు జస్ట్ 155. స్ట్రైక్ రేట్ కూడా చాలా పూర్. 113 స్ట్రైక్ రేట్‌తో దారుణమైన బ్యాటింగ్ చేస్తున్నాడు.

3. మయాంక్ అగర్వాల్
చాలా ఖరీదైన ఆటగాడు. 8.25 కోట్ల పెట్టి మరీ కొనుక్కుంది సన్ రైజర్స్ హైదరాబాద్. కాని రేటుకు తగ్గ ఆట మాత్రం ఆడింది లేదు. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడిన మయాంక్ అగర్వాల్.. కేవలం 113 పరుగులు మాత్రమే చేశాడు. ఇక స్ట్రైక్ రేట్ 108. చెప్పుకోవడం కూడా అనవసరం. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 41 బాల్స్‌లో 48 పరుగులు చేశాడు. ఓ టాప్ ప్లేయర్ ఆడాల్సిన ఆటేనా ఇది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×