E-Paper
Advertisement

Team India: పెళ్లాల‌తో జ‌ల్సాలు…ఆ రూల్స్ బ్రేక్‌, టీమిండియా క్రికెటర్ల‌పై బీసీసీఐ చ‌ర్య‌లు

Team India: పెళ్లాల‌తో జ‌ల్సాలు…ఆ రూల్స్ బ్రేక్‌, టీమిండియా క్రికెటర్ల‌పై బీసీసీఐ చ‌ర్య‌లు
Advertisement

Team India: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ జట్టును చిత్తు చేసి మరి సెమీ ఫైనల్స్ లోకి దూసుకు వచ్చింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే మార్చి 5వ తేదీన ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండవ సెమీ ఫైనల్ జరగనుంది. ముంబై వేదికగా ఈ సెమీ ఫైనల్ జరగనుంది. దీంతో ఈడెన్ గార్డెన్స్ నుంచి నేరుగా ముంబైకి వచ్చేసింది టీం ఇండియా. ఇక్కడే కొంతమంది టీం ఇండియా ప్లేయర్లు పెద్ద తప్పిదం చేశారు. బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేస్తూ.. ఇంటికి వెళ్ళిపోయారు టీమిండియా ప్లేయర్.

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

BCCI రూల్స్ బ్రేక్.. పెళ్ళాలతో టీమిండియా ప్లేయర్ల ఎంజాయ్

Advertisement

వెస్టిండీస్ పై విజయం సాధించిన టీమిండియా ప్లేయర్లు కాస్త ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు. సెమీఫైనల్స్ లో అడుగుపెట్టాం కదా… మమ్మల్ని ఎవడు ఏం పీకుతాడు అన్న రేంజ్ లో ఫీల్ అయిపోతున్నారు. ఇందులో భాగంగానే ముంబైకి చేరుకున్న టీమిండియా ప్లేయర్లు కొంతమంది… జట్టును వీడి ఇంటికి వెళ్లి పోయారు. తమ భార్యలతో సొంత కార్లు తీసుకొని ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లిస్టులో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అలాగే శివమ్ దూబే ఉన్నారు. ఈ ముగ్గురి హోమ్ టౌన్ ముంబై అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటికి వెళ్లి రెండు రోజులు రిలాక్స్ కావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. ఇక మిగిలిన టీమిండియా ప్లేయర్లు బస్సులో బీసీసీఐ చెప్పినట్లుగా హోటల్ లోనే ఉండిపోయారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో బిసిసిఐ యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిందట. రూల్స్ ప్రకారం వాళ్లపై చర్యలు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

BCCI రూల్స్ ఏంటి ?

2024 చివరలో ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు టీమ్ ఇండియా దారుణంగా విఫలమైంది. ఇలాంటి నేపథ్యంలోనే టీమ్ ఇండియా ప్లేయర్ల ముందు కఠిన రూల్స్ పెట్టింది బీసీసీఐ. మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు భార్యలు, ప్రియురాలు అస్సలు రాకూడదని కండిషన్ పెట్టింది. అలాగే టీమిండియా కోసం ఏర్పాటుచేసిన బస్సులో మాత్రమే ప్లేయర్లు వెళ్లాలని పేర్కొంది. సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలు వినియోగించి బయటకు తిరగకూడదని పేర్కొంది బీసీసీఐ. బీసీసీఐ కేటాయించిన హోటల్ లో మాత్రమే ప్లేయర్లు ఉండాలి. ఇల్లు దగ్గరగా ఉంది.. సొంత ఊరు అని బయటకు వెళ్లకూడదు. అలా వెళితే మ్యాచ్ ఫీజులో కోత అలాగే ఒకటి లేదా రెండు మ్యాచ్ లు ఆడకుండా చర్యలు తీసుకోనుంది బీసీసీఐ. మరి ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అలాగే శివమ్ దూబే లపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

 

?igsh=MXRjMzZlMnhoc3Z4Zw==

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×