E-Paper
Advertisement

టీమిండియాను కాదు..ముందు BCCIని త‌న్నాలి..డ‌బ్బుల కోసం క‌క్కుర్తి ప‌డి !

టీమిండియాను కాదు..ముందు BCCIని త‌న్నాలి..డ‌బ్బుల కోసం క‌క్కుర్తి ప‌డి !
Advertisement

Trolls On BCCI: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బీసీసీఐ ( BCCI) చెత్త నిర్ణయాల వల్ల టీమిండియా ప్రదర్శన చెత్తగా ఉంటుందని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు అభిమానులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL ) ద్వారా డబ్బులు సంపాదించి, టీమిండియా క్రికెటర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ కారణంగానే ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే ప్రదర్శన కనబరుస్తోందని అంటున్నారు.

Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో వరుసగా రెండు టీ20లో ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్ వర్షార్పణమైంది.. లేకపోతే ఆ మ్యాచ్ కూడా దొబ్బేది. అయితే నిన్న మూడవ టి20 ఓడిపోయిన నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లను చాలా మంది సీనియర్ క్రికెటర్లు తిడుతున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం తిట్టాల్సింది టీమిండియాను కాదని, బీసీసీఐ పెద్దలను తన్నాల్సిందే అంటూ సంచలన పోస్టులు పెడుతున్నారు.

టీమిండియాను కాదు..ముందు BCCIని త‌న్నాలి

రెండు నెలల ఐపీఎల్ వ్యూయర్షిప్, డబ్బుల సంపాదన కోసం టీమిండియా క్రికెటర్ల జీవితాలతో బీసీసీఐ ఆడుకుంటుందని ఫైర్ అవుతున్నారు. మొన్న రెండు నెలల పాటు టీమిండియా ప్లేయర్లతో ఐపిఎల్ ఆడించిన బీసీసీఐ… రెస్ట్ ఇవ్వకుండానే వరుసగా టోర్నమెంట్లు ఆడిస్తోందని ఫైర్ అవుతున్నారు. అందులోనూ సూర్యకుమార్ యాదవ్ లాంటి గ్రేట్ కెప్టెన్ ను తప్పించారని మండిపడుతున్నారు. ఐపీఎల్ లో భారీ స్కోరు నమోదు కావాలన్న లక్ష్యంతో.. ఫ్లాట్, హైవే లాంటి మైదానాలను తయారు చేశారని బిసిసిఐ పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్లు కూడా ఈ ఐపీఎల్ ఫ్లాట్ మైదానాలకు అలవాటు పడిపోయారని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు.. విదేశీ గడ్డలపై చేతులెత్తేస్తున్నారని షాకింగ్ నిజాలను బయటపెడుతున్నారు ఫ్యాన్స్. ఫ్లాట్ మైదానాలలో ఆడిన తర్వాత టీమిండియా ప్లేయర్లకు కొంత రెస్టు తో పాటు, ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇవేవీ లేకుండా… వరుసగా టోర్నమెంట్లు బిసిసిఐ ఆడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు సంపాదించే పనిలో పడ్డ బిసిసిఐ… టీమిండియా ప్లేయర్లకు ఏం కావాలో అర్థం చేసుకోవడం లేదని నిప్పులు చెరుగుతున్నారు.

టీమిండియా మెరుగుపడాలంటే ఎలా ?

Advertisement

విదేశీ మైదానాలలో తేలిపోతున్న టీమిండియా క్రికెటర్లు… ఫ్లాట్ మైదానాలకు అలవాటు పడకూడదు. అంటే ఐపిఎల్ టోర్నమెంటులో బ్యాటింగ్ కు అనుకూలంగా కాకుండా.. బౌలింగ్ కు అనుకూలంగా ఉండే మైదానాలను సిద్ధం చేయాలి. అప్పుడే టీమిండియా ప్లేయర్లు విదేశీ టూర్లలో కూడా రాణిస్తారని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు. ఆ దిశగా బీసీసీఐ అడుగులు వేయాలని కోరుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ తో పాటు టీమిండియా జట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×