E-Paper
Advertisement

కొంకణ్ నుంచి డార్జిలింగ్ వరకు.. వర్షాకాలంలో అస్సలు మిస్ కాకూడని అందమైన ట్రైన్ జర్నీలు!

కొంకణ్ నుంచి డార్జిలింగ్ వరకు.. వర్షాకాలంలో అస్సలు మిస్ కాకూడని అందమైన ట్రైన్ జర్నీలు!
Advertisement

Most Beautiful Monsoon Train Journeys: వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి రైలు ప్రయాణం కంటే మంచి  ఆప్షన్ మరొకటి ఉండదు. పచ్చని కొండలు, పొగమంచుతో కప్పుకున్న లోయలు, ఎత్తైన జలపాతాలు, దట్టమైన అడవుల మధ్యుగా సాగే కొన్ని రైలు మార్గాలు ప్రయాణికులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి. భారత్ లో వర్షాకాలంలో తప్పక చూడాల్సిన కొన్ని అందమైన రైలు మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.కొంకణ్ రైల్వే (ముంబై – గోవా)

వర్షాకాలంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాల్లో కొంకణ్ రైల్వే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ముంబై నుంచి గోవా వరకు సాగే ఈ మార్గంలో పచ్చని పొలాలు, కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాలు, పొడవైన సొరంగాలు, చిన్న వంతెనలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా దూధ్‌ సాగర్ జలపాతం వర్షాకాలంలో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రూట్‌ లో ప్రయాణించడానికి ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టపడుతారు.

2.నీలగిరి మౌంటైన్ రైల్వే (మెట్టుపాలయం – ఊటీ)

Advertisement

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న నీలగిరి పర్వత రైల్వే కూడా వర్షాకాలంలో ఎంతో అందంగా ఉంటుంది. మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు వెళ్లే ఈ టాయ్ ట్రైన్ దట్టమైన అడవులు, కొండలు, చిన్న వాగులు, జలపాతాల మీదుగా ప్రయాణిస్తుంది. వర్షంతో పచ్చగా మారిన నీలగిరి పర్వతాల అందాలు ప్రయాణికులను కనువిందు చేస్తాయి.

3.కల్కా – సిమ్లా రైల్వే

హిమాచల్ ప్రదేశ్‌ లోని కల్కా నుంచి సిమ్లా వరకు వెళ్లే ఈ నారో గేజ్ రైల్వే కూడా ప్రసిద్ధి చెందింది. ఈ మార్గంలో వందకు పైగా సొరంగాలు, వందలాది వంతెనలు ఉంటాయి. వర్షాకాలంలో పైన్ చెట్లు, పొగమంచు, చల్లని వాతావరణం కలిసి ఈ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

4.పశ్చిమ కనుమలు (బెంగళూరు – మంగళూరు/కార్వార్)

Advertisement

బెంగళూరు నుంచి మంగళూరు, కార్వార్ వైపు వెళ్లే రైలు మార్గం కూడా ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సకలేశ్‌పూర్ ఘాట్ ప్రాంతంలో పచ్చని కొండలు, లోయలు, మేఘాలతో కప్పుకున్న పర్వతాలు, చిన్న జలపాతాలు ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తాయి.

5.డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే

న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్ వరకు వెళ్లే ఈ పాపులర్ టాయ్ ట్రైన్ తూర్పు హిమాలయాల అందాలను చూపిస్తుంది. ఈ రూట్ అంతా తేయాకు తోటలు, పొగమంచుతో కప్పుకున్న కొండలు, చల్లని వాతావరణం ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.

వర్షాకాలంలో ఈ రైలు ప్రయాణాలు ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. పచ్చని ప్రకృతి మధ్య నెమ్మదిగా సాగే ఈ ప్రయాణాలు ఫోటోగ్రఫీ, ఫ్యామిలీ ట్రిప్స్, ఫ్రెండ్స్ తో ట్రిప్‌లకు కూడా మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.  మాన్సూన్ సీజన్‌ లో ఒకసారి అయినా ఈ రూట్లలో ప్రయాణిస్తే జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతులను పొందే అవకాశం ఉంటుంది.

Read Also: ఈ రైల్వే స్టేషన్ల పేర్లు వింటే నవ్వు ఆపుకోలేరు.. ఇంతకీ అవేంటో తెలుసా?

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×