E-Paper
Advertisement

Tanveer Ahmed : కోహ్లీ మ‌రో 1000 జ‌న్మ‌లు ఎత్తినా, బాబ‌ర్ ఆజంను అందుకోలేడు

Tanveer Ahmed : కోహ్లీ మ‌రో 1000 జ‌న్మ‌లు ఎత్తినా, బాబ‌ర్ ఆజంను అందుకోలేడు
Advertisement

Tanveer Ahmed:  టీమిండియా ప్లేయర్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు నిత్యం హాట్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో ఫిక్సింగ్ ( Match Fixing) జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ (Kohli ) మరో 1000 జన్మలు ఎత్తిన కూడా.. బాబర్ ఆజంను ( Babar Azam) అందుకోలేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్.

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు

కోహ్లీ మ‌రో 1000 జ‌న్మ‌లు ఎత్తినా, బాబ‌ర్ ఆజంను అందుకోలేడు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బాబర్ ఆజం అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రాణించి తన జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. పెషావర్ జల్మీ జట్టును చాంపియన్ గా నిలిపాడు బాబర్ ఆజం. ఈ క్రమంలో అతనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని మళ్లీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో బాబర్ ఆజంను మెచ్చుకుంటూ… విరాట్ కోహ్లీ పరువు తీశాడు తన్వీర్ అహ్మద్. విరాట్ కోహ్లీ లాంటి అల్పులు… బాబర్ ఆజం సాధించిన కీర్తిని దక్కించుకోలేరని వెల్లడించారు. విరాట్ కోహ్లీ మరో వెయ్యి జన్మలు ఎత్తిన కూడా.. బాబర్ ఆజం స్థాయికి రాబోడంటూ బాంబు పేల్చారు.

త‌న్వీర్ అహ్మ‌ద్ కు కోహ్లీ ఫ్యాన్స్ కౌంట‌ర్లు

విరాట్ కోహ్లీ సొంతంగా తన జట్టుకు ఐసీసీ ట్రోఫీ లేదా ఐపీఎల్ ట్రోఫీని అందించలేకపోయాడని విమర్శలు చేశారు. కానీ బాబర్ కెప్టెన్ గా ఉన్న పెషావర్ జల్మీ జట్టును ఇటీవల ఛాంపియన్ చేశాడని గుర్తు చేస్తున్నారు. కానీ విరాట్ కోహ్లీ ఈ రేంజ్ లో ఏ టైటిల్ కూడా తన సొంత జట్టుకు అందించలేకపోయాడని పరువు తీసే ప్రయత్నం చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. బాబర్ ఆజం పిల్ల బచ్చగాడని.. వాడికి, విరాట్ కోహ్లీకి పోలిక ఏంటి ? అంటూ మండిపడుతున్నారు. అటు క్రీడా విశ్లేషకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. బాబర్ ఆజం, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న రికార్డుల ప్రకారం కింగ్ కోహ్లీ బెటర్ అంటున్నారు. విరాట్ కోహ్లీ ఎన్నో ఛేజింగ్ లు చేసి, టీమిండియాను గెలిపించాడ‌ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ కు అస‌లు సిస‌లు మొగుడు కోహ్లీనేన‌ని చెబుతున్నారు.

Advertisement

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు (Indian Premier League 2026 Tournament)

 

https://www.facebook.com/photo/?fbid=122225070554289704&set=a.122097672758289704

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×