E-Paper
Advertisement

PSL 2026: స్టేడియంలోనే సిగ‌రేట్ తాగిన పోరంబోకు..మ‌రోసారి పాకిస్తాన్ పరువు మంట గలిసింది

PSL 2026: స్టేడియంలోనే సిగ‌రేట్ తాగిన పోరంబోకు..మ‌రోసారి పాకిస్తాన్ పరువు మంట గలిసింది
Advertisement

PSL 2026:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 ) మార్చి 26వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. నసీం షా వివాదాస్పద పోస్ట్ నుంచి మొదలుకొని బాల్ టాంపరింగ్ వరకు అన్ని వివాదాలే. అయితే, లేటెస్ట్ గా ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో మరో వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ సీనియర్ క్రీడా జర్నలిస్ట్ ఎజాజ్ బఖ్రి ( Sports Journalist Ejaz Bakhri ) స్టేడియంలోనే మ్యాచ్ జరుగుతుండగా సిగరెట్ ( smoking) తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Also Read: IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

స్టేడియంలోనే సిగ‌రేట్ తాగిన పోరంబోకు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Pakistan Super League 2026 ) భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ అంటే మొన్న హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్ ( Hyderabad Kingsmen vs Multan Sultans )
మధ్య ఆసక్తికర ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగానే పాకిస్తాన్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఎజాజ్ బఖ్రీ వివాదానికి తెర లేపారు. స్టేడియంలో లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే సిగరెట్ తాగుతూ కనిపించారు. అయితే అదే సమయంలో కెమెరామెన్ ఈ జర్నలిస్టు ఎజాజ్ బఖ్రీ, తన కెమెరాను తింపారు. దీంతో సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎజాజ్ బఖ్రీ బాగోతం బయటపడింది. వీడియో రికార్డ్ అయిన నేపథ్యంలో వెంటనే సిగిరెట్ ఆర్పేశాడు. తాను కూర్చున్న సీటుకే, సిగిరెట్ ను నలిపాడు. ఇక ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

అభిమానులు లేకుండా టోర్నమెంట్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఇలాంటి పోరంబోకులకు ఎలా ఎంట్రీ ఇచ్చిందని ఫైర్ అవుతున్నారు. మ్యాచ్ చూడడానికి వెళ్లి సిగరెట్ తాగుతారా ? అంటూ నిలదీస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఇండియన్ ఫాన్స్ కూడా తమ స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. వరుస వివాదాలకు తెర లేపుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును బ్యాన్ చేయాలని ఐసీసీని కోరుతున్నారు. గతంలో కూడా సిగిరెట్ తాగిన సంఘటనలు ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో చోటు చేసుకున్నాయి. 2024 పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇమాద్ వసీం ఏకంగా డ్రెస్సింగ్ రూమ్ లోనే తాగి దొరికిపోయాడు. ఇక ఇదే టోర్నమెంట్ లో తాజాగా డేవిడ్ వార్నర్, మొయిన్ అలీ మధ్య వివాదం రాజకుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఇద్దరు బండ బూతులు తిట్టుకున్నారు. ఈ సందర్భంగా మొయిన్ అలీని కొట్టేందుకు కూడా మీదకు వెళ్లాడు డేవిడ్ వార్నర్. ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది.

Advertisement

 

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఫ‌ర్హాన్‌ 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ బార్డ‌ర్‌లో తిరుగుతా

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×