E-Paper
Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘క్రైమ్ 101’ ఎలా ఉందంటే.. ఫుల్ రివ్యూ..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘క్రైమ్ 101’ ఎలా ఉందంటే.. ఫుల్ రివ్యూ..
Advertisement

Crime 101: హాలీవుడ్ స్టార్ హీరోలు క్రిస్ హెమ్స్‌వర్త్ (థోర్ ఫేమ్), మార్క్ రుఫెలో (హల్క్ ఫేమ్) హాలీ బెర్రీ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హీస్ట్ థ్రిల్లర్ ‘క్రైమ్ 101’ (Crime 101). అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలాంటి స్పందన ఇచ్చారో ఇక్కడ తెలుసుకుందాం.

Read also-షాకింగ్ రివ్యూ: రాకాస హిట్టా ? ఫట్టా? కానీ లాజిక్ ఎక్కడ?

కథా నేపథ్యం

Advertisement

ఈ సినిమా కథ లాస్ ఏంజిల్స్ నేపథ్యంలో సాగుతుంది. నగరంలోని 101 ఫ్రీవే వెంబడి వరుసగా జరుగుతున్న విలువైన నగల దొంగతనాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ దొంగతనాలకు పాల్పడే తెలివైన గజదొంగగా క్రిస్ హెమ్స్‌వర్త్ నటించగా, అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించే డిటెక్టివ్‌గా మార్క్ రుఫెలో కనిపించారు. వీరిద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్, దర్యాప్తులో భాగంగా ఇన్సూరెన్స్ బ్రోకర్‌గా ఉన్న హాలీ బెర్రీ పాత్ర ప్రవేశించడం కథను మలుపు తిప్పుతుంది. అసలు ఈ మలుపు ఏంటి?.. దొంగ పోలీస్ మధ్య మైండ్ గేమ్ ఎలా సాగిందో తెలియాలంటే మొత్తం చూడాల్సిందే.

Read also-Illu Illalu Pillalu Today Episode: పుట్టింటికి వెళ్లిన వల్లి.. నిజం చెప్పిన చందు.. పూజలో కూర్చున్న ప్రేమ, ధీరజ్..

ప్రేక్షకుల స్పందన

Advertisement

ఈ సినిమాపై ఇంటర్నెట్ వినియోగదారులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని అద్భుతమైన థ్రిల్లర్ అని కొనియాడుతుంటే, మరికొందరు నిరాశ చెందారు.

పాజిటివ్ స్పందన: సినిమాలోని ఉత్కంఠభరితమైన వాతావరణం నెమ్మదిగా సాగే కథనం (Slow-burn thriller) నచ్చిందని కొందరు ప్రేక్షకులు పేర్కొన్నారు. “ఈ సినిమా చాలా ప్రశాంతంగా మొదలై, అద్భుతమైన టెన్షన్‌ను క్రియేట్ చేస్తుంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్లు చూడటం చాలా బాగుంది” అని ఒక యూజర్ రాశారు.

నెగటివ్ స్పందన: మరికొందరు ఈ సినిమా చాలా బోర్ కొట్టించిందని అభిప్రాయపడ్డారు. “స్టోరీ లైన్ పాతదే, కొత్తదనం ఏమీ లేదు. హాలీ బెర్రీ నటన పరిమితంగా ఉంది” అని ఒక విమర్శకుడు పేర్కొన్నారు.

నటీనటుల గురించి: క్రిస్ హెమ్స్‌వర్త్ అంటే ఇష్టమున్నప్పటికీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. యాక్షన్ సీక్వెన్స్ నటీనటుల మధ్య కెమిస్ట్రీ బాగున్నప్పటికీ, స్క్రీన్ ప్లే లో బలం తగ్గిందని వారి అభిప్రాయం.

Read also-‘బ్రహ్మముడి’ సీరియల్‌ ఏఫ్రిల్‌ 3: కిడ్నాప్ గురించి రాజు, లక్కీలకు చెప్పిన ఐశ్వర్య 

మొత్తానికి.. ‘క్రైమ్ 101’ సినిమా యాక్షన్, హీస్ట్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఒక మోస్తరుగా నచ్చే అవకాశం ఉంది. మార్వెల్ హీరోలైన థోర్, హల్క్ లని ఒకే స్క్రీన్‌పై చూడటం అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు గనుక సీరియస్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడితే, ఒకసారి ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. అయితే కథలో పెద్దగా కొత్తదనం ఆశించకుండా కేవలం నటీనటుల పర్ఫార్మెన్స్ కోసం చూడవచ్చు.

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×