E-Paper
Advertisement

Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ కు ఘోర అవమానం.. IPL 2026 టోర్నమెంట్ కు దూరం!

Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ కు ఘోర అవమానం.. IPL 2026 టోర్నమెంట్ కు దూరం!
Advertisement

Shreyas Iyer : టీమిండియా క్రికెట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్ గురించి దాదాపు అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌లే అయ్య‌ర్ ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ లో గాయపడిన విష‌యం తెలిసిందే. అయితే శ్రేయాస్ అయ్యర్‌కు ఆ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నెలలు అయినా పట్టనుంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అయ్యర్‌కు ప్రస్తుతం సాధారణ పనులు, చిన్నపాటి వ్యాయామాలకు అనుమతి లభించింది. స్ప్లీన్‌పై ఒత్తిడి పెంచే పనులు చేయరాదని సూచించారు. మరో రెండు నెలల తర్వాత యూఎస్జీ స్కాన్ అనంతరం రిహాబిలిటేషన్ ప్రారంభమవుతుంది. దీంతో రానున్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లకు శ్రేయాస్ అయ్యర్ దూరంగా ఉండనున్నాడు. అలాగే ఐపీఎల్ ప్రారంభంలో అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న శ్రేయ‌స్ అయ్యార్.. కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

Also Read : Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్స్కాన్‌లో గాయం

స్కాన్‌లో గాయం

Advertisement

సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ నేలను బలంగా గుద్దుకున్నాడు. దీంతో అంతర్గత రక్తస్రావం కావడంతో ఐసీయూలో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత నుంచి అయ్యర్‌పై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇటీవల అతనికి అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్ చేయించగా, ఆ రిపోర్టులను ప్రఖ్యాత క్రీడా వైద్య నిపుణుడు డాక్టర్ దిన్షా పెర్డి‌వాలా పరిశీలించారు. స్కాన్‌లో గాయం మానుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ సాధారణంగా అతని పనులు అతను చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడానికి ప్రస్తుతం వైద్యులు అనుమతి ఇచ్చారు. అయితే స్ప్లీన్‌పై ఒత్తిడి పెరిగేలా చేసే ఏ పనులు చేయకూడదని కఠినంగా సూచించారు.

మళ్లీ యూఎస్జీ స్కాన్

Advertisement

అయ్యర్‌కు మరో రెండు నెలల తర్వాత మళ్లీ యూఎస్జీ స్కాన్ చేయనున్నారు. ఆ రిపోర్టులు సాధారణంగా వచ్చిన తర్వాతే అతడిని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫార్మల్ రిహాబిలిటేషన్ కోసం అనుమతించనున్నారు. ఈ లెక్కన చూసుకుంటే మరో రెండు నుంచి మూడు నెలల పాటు శ్రేయాస్ అయ్యర్ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిందేనని తెలుస్తోంది. దాంతో రాబోయే దక్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లు పూర్తిగా మిస్సవ్వడం ఖాయం. 29 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ టీమిండియా కీలక మిడిలార్డర్ బ్యాటర్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసి వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. అయ్యర్ ఫిట్‌నెస్ కారణాలతో అటు టెస్టు, ఇటు టీ20లకు కాకుండా కేవలం వన్డే ఫార్మాట్‌లకే అతన్ని సెలెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ ఒక్క ఫార్మాట్‌లో కూడా ఇలా గాయపడి క్రికెట్‌కు దూరమవుతూ వస్తున్నాడు. రానున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read : ODI in Vizag : వైజాగ్ లో సౌతాఫ్రికాతో వన్డే..రోహిత్‌, కోహ్లీ వ‌స్తున్నారు..టికెట్లు ఎప్పుడంటే

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×