E-Paper
Advertisement

Shahid Afridi: షాహీన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌..వాడు నా అల్లుడని చెప్పుకోవ‌డానికే సిగ్గేస్తోంది

Shahid Afridi: షాహీన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌..వాడు నా అల్లుడని చెప్పుకోవ‌డానికే సిగ్గేస్తోంది
Advertisement

Shahid Afridi:  బంగ్లాదేశ్ చేతిలో తాజాగా మూడు వన్డేల సిరీస్ ను కోల్పోయింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. చిన్న జట్టుపై ఓడిపోవడం దారుణమని మండిపడుతున్నారు. షాహీన్ అఫ్రిది కెప్టెన్సీ పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) కూడా స్పందించారు. ముఖ్యంగా పాకిస్తాన్ వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రిదిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాడు నా అల్లుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తోందని సీరియస్ అయ్యారు షాహిద్ ఆఫ్రీది.

Also Read: World Cup 2027: టీమిండియా ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీ..గిల్ కు నో ఛాన్స్‌..వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమ్ ఇదే !

Advertisement

బంగ్లాదేశ్ చేతిలో 11 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా పాకిస్తాన్ వైఫల్యం పై షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) కూడా స్పందించారు. ముఖ్యంగా తన అల్లుడిపై విరుచుకుపడ్డారు. తన అల్లుడు షాహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ చేతకావడం లేదని మండిపడ్డారు. షాహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారో తనకు అర్థం కాలేదని సెలెక్షన్ కమిటీపై కూడా నిప్పులు చెరిగారు.మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో కూడా ఇలా చెత్తగా ప్రదర్శించిన పాకిస్తాన్ ఓడిపోయినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ పాకిస్తాన్ కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. పసికూన‌ బంగ్లాదేశ్ పైన కూడా ఓడిపోవడం దారుణమని సీరియస్ అయ్యారు షాహిద్ ఆఫ్రీది.

పాకిస్తాన్ ప్లేయర్లే కాదు సెలక్షన్ కమిటీ కూడా సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారో ? ఎవరికి కెప్టెన్సీ అప్పగిస్తున్నారో ? గందరగోళంగా పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ వ్యవహారం ఉందని మండిపడ్డారు. పాకిస్తాన్ సెలక్షన్ కమిటీలో క్రికెట్ ఆడిన అనుభవం ఎవరికీ లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లను మాత్రమే తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రిజ్వాన్ లాంటి సీనియర్ ప్లేయర్లు విఫలమైతే కుర్ర క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు ఎవరు కెప్టెన్ అన్న విషయం ఎవరికీ క్లారిటీ లేదని సీరియస్ అయ్యారు. ఒక్కో సిరీస్ కు ఒక్కో కెప్టెన్ తయారు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే బంగ్లాదేశ్ లాంటి చిన్నజ‌ట్ల పైన కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చిందని షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న జరిగిన మూడవ వన్డేలో 11 పరుగులు తేడాతో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 290 పరుగులు సాధించింది బంగ్లాదేశ్. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ పోరాడి ఓడిపోయింది. 279 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.

Also Read: SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×