E-Paper
Advertisement

Harish Shankar: బావా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రమ్మంటే.. థమన్ సంస్కారానికి హరీష్ ఫిదా!

Harish Shankar: బావా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రమ్మంటే.. థమన్ సంస్కారానికి హరీష్ ఫిదా!
Advertisement

Harish Shankar: మ్యూజిక్ సెన్సేషన్ థమన్‌పై దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిత్రాలకు థమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) గురించి చెబుతూ, ఈసారి కూడా థమన్ రచ్చ మామూలుగా ఉండదని, కుమ్మి కుమ్మి పడేశాడనేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆయన బిజీగా ఉండటంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను థమన్ చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సంగీత దర్శకులెవరు కనిపించలేదు. దీంతో హరీష్ శంకర్ ఓ వీడియో ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Also Read- Actress Kavya: ఫస్ట్ టైమ్ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న నటి కావ్య.. అసలు ఏమైంది?

ఎవరెస్ట్ అంత సంస్కారం..

Advertisement

‘‘బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థమన్ కుమ్మేస్తున్నాడు. ఆల్రెడీ ట్రైలర్‌లో చూశారు.. రేపు సినిమాలో చూస్తారు. థమన్‌తో పని చేయడంతో సినిమాపై నాకు ఉన్న నమ్మకం రెట్టింపు అయ్యింది. రేపు థియేటర్లలో థమన్ అందించిన సౌండ్, రీసౌండ్ విని అందరూ షాక్ అవుతారు. లవ్ యూ బావ. నువ్వు నా లైఫ్‌లో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. థమన్ గురించి ఇంకో ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే.. ‘బావా.. దేవి రావడం లేదు, బిజీగా ఉన్నాడు.. నువ్వన్నా ప్రీ రిలీజ్ వేడుకకు రా’ అని రిక్వెస్ట్ చేశా. ‘ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. నేను కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా అంతే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు నేను బ్యాక్ ఉంటాను. నన్నెందుకురా స్టేజ్ మీదకు పిలుస్తున్నావు. పైగా.. 26న విడుదల కావాల్సిన సినిమాను 19కి తీసుకు వచ్చావు. సినిమా డేట్ ముందుకు వచ్చింది, నాకు మ్యూజిక్ పూర్తి చేయడం ముఖ్యం. ఇప్పుడు ఈవెంట్‌కు వస్తే పని ఆగిపోతుంది, నేను రాను’ అని చెప్పడంతో థమన్‌ సంస్కారం ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగినట్లుగా అనిపించింది. బావా.. నీ సంస్కారం నుంచి, నీ మాట నుంచి, నీ బిహేవియర్ నుంచి.. నేను కూడా చాలా నేర్చుకున్నాను. హ్యాట్సాఫ్ బావ..’’ అని హరీష్ శంకర్ ఈ వీడియోలో ప్రశంసలు కురిపించారు.

Also Read- Pawan Kalyan: విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ ఇష్యూపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వాన్నే ఎందుకు?

ఇంత పూనకాలతో కొట్టేశావేంట్రా?

Advertisement

తాజాగా థమన్‌పై హరీష్ శంకర్ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో.. ‘‘బావా.. థమన్. ఓవర్సీస్ కాపీకి సంబంధించి ఫైనల్ సౌండ్ చెకింగ్ ఇప్పుడే అయింది. రేయ్ బావా.. లైఫ్ లాంగ్ నీకు రుణపడిపోయా. ఇంత పూనకాలతో కొట్టేశావేంట్రా?’’ అంటూ మరోసారి థమన్‌‌ని హరీష్ కొనియాడారు. ఇక ఈ ట్వీట్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇస్తున్న రియాక్షన్ అయితే మాములుగా లేదు. ‘ఉ ఎలివేషన్స్ ఏంటి అన్నా.. కొణిదెల థమన్ ఆన్ డ్యూటీ’, ‘మీరే పూనకం అన్నారంటే.. ఇక థియేటర్లలో బాక్స్‌లు బద్దలే’ అని నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Also Read- Mahesh Babu: ఫ్యామిలీ ఫంక్షన్ లో మహేష్ బాబు స్టైలిష్ లుక్… ప్రైవేట్ ఫోటోలు వైరల్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×