E-Paper
Advertisement

Shahid Afridi: దక్షిణాఫ్రికా దెబ్బకు పాకిస్తాన్ కంటే ముందే, టీమిండియా ఎలిమినేట్ కావ‌డం ప‌క్కా

Shahid Afridi: దక్షిణాఫ్రికా దెబ్బకు పాకిస్తాన్ కంటే ముందే, టీమిండియా ఎలిమినేట్ కావ‌డం ప‌క్కా
Advertisement

Shahid Afridi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నుంచి టీమిండియా ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium, Ahmedabad ) దక్షిణాఫ్రికా ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ దెబ్బకు ఇండియా ఇంటిదారి పట్టడం ఖాయమని బాంబు పేల్చారు షాహిద్ ఆఫ్రీది. టీమిండియా ( Team India) బ్యాటింగ్ ఆర్డర్ చూస్తుంటే పాకిస్తాన్ ( Pakistan) కంటే ముందే ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దక్షిణాఫ్రికా విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదిచే క్రమంలో, 111 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది టీమ్ ఇండియా. దీంతో దక్షిణాఫ్రికాపై 76 పరుగుల తేడాతో ఓడిపోయింది సూర్య కుమార్ యాదవ్ సేన. ఇక టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోయిన నేపథ్యంలో సెమీస్ ఆశలను కఠిన తరం చేసుకుంది. సెమిస్ లోకి వెళ్లాలంటే కచ్చితంగా మిగిలిన రెండు మ్యాచ్ లలో టీమిండియా గెలవాలి. జింబాబ్వే అలాగే వెస్టిండీస్ పైన విక్టరీ కొడితేనే సెమిస్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇంటికి వెళ్లాల్సిందే.

ఇండియా పై విషం కక్కిన షాహిద్ ఆఫ్రిది

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా దెబ్బకు టీమిండియా ఇంటిదారి పట్టే పరిస్థితి వచ్చిందన్నారు. తమ పాకిస్తాన్ జ‌ట్టు కంటే ముందే టీమిండియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గ్రూప్ స్టేజ్ లో టీమిండియా ఎప్పుడు అద్భుతంగానే ఆడుతుంది… కానీ సూపర్ 8 లాంటి స్టేజ్ దగ్గరికి వస్తే టీమిండియా ప్లేయర్లు చేతులు ఎత్తేస్తారని కౌంటర్ ఇచ్చారు షాహిద్ ఆఫ్రీది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ లాంటి హోం గ్రౌండ్ లోనే టీమ్ ఇండియా ఓడిపోవడం వాళ్ల పతనానికి నాంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ అడ్డాలోనే టీమిండియా జట్టును దెబ్బ కొట్టిన దక్షిణాఫ్రికాకు శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఈ జింబాబ్వే చేతిలో కూడా ఓడిపోవడానికి టీమిండియా సిద్ధంగా ఉండాలని కోరారు.

Advertisement

Also Read: NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×