E-Paper
Advertisement

Scotland Cricket Team: ఇండియాలో అడుగుపెట్టిన స్కాట్లాండ్‌…పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ఇక గాజులు వేసుకోవాల్సిందే

Scotland Cricket Team: ఇండియాలో అడుగుపెట్టిన స్కాట్లాండ్‌…పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ఇక గాజులు వేసుకోవాల్సిందే
Advertisement

Scotland Cricket Team: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడేందుకు గాను, ఇండియాకు చేరుకుంది స్కాట్లాండ్ జట్టు. చివరి క్షణంలో అదృష్టవశాత్తు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో స్థానం దక్కించుకుంది స్కాట్లాండ్ ( Scotland Cricket Team). బంగ్లాదేశ్ బహిష్కరణ నేపథ్యంలో స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెటర్లను ( Bangladesh ) దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. స్కాట్లాండ్ ఇండియాకు ధైర్యంగా వచ్చిందని, ఇక మీరు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలని ఇండియన్ ఫాన్స్ దారుణంగా ఆడుకుంటున్నారు.

Also Read: Trolls On Jemimah Rodrigues: 4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?

ఇండియా గడ్డపై అడుగుపెట్టిన స్కాట్లాండ్ క్రికెట్ టీం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ప్లేస్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడేందుకుగాను పశ్చిమ బెంగాల్ లోని కోల్ క‌తా గడ్డపై అడుగు పెట్టింది స్కాట్లాండ్ క్రికెట్ జట్టు. ఈ మేరకు కోల్ క‌తా విమానాశ్రయంలో స్కాట్లాండ్ జట్టు దిగిన వీడియో బయటకు వచ్చింది. దీంతో పాకిస్తాన్ తో ( Pakistan ) పాటు బంగ్లాదేశ్ ను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు ఇండియన్స్. స్కాట్లాండ్ లాంటి చిన్న జట్టు ఎలాంటి భయం లేకుండా ఇండియాలో అడుగుపెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇండియాలో సేఫ్టీ లేదని కారు కూతలు కూసిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెటర్లు ఈ దృశ్యాన్ని కచ్చితంగా చూడాలని కౌంటర్ ఇస్తున్నారు. ఈ వీడియోను ఒకటికి 100 సార్లు చూసుకొని.. ఇండియా సేఫ్టీ గురించి ఆలోచన చేయాలని చురకలు అంటించారు. ఇండియాకు రాకుండా వరల్డ్ కప్ బహిష్కరించిన క్రికెటర్లందరూ ఇంట్లో గాజులు వేసుకొని కూర్చోవాలని కౌంటర్లు పేల్చుతున్నారు.

స్కాట్లాండ్ కు ఎందుకు అవకాశం వచ్చిందంటే?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో సేఫ్టీ లేదని బంగ్లాదేశ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపిఎల్ నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ డ్రామాలు ఆడటం మొదలుపెట్టింది బంగ్లాదేశ్. అంతేకాదు ఐపీఎల్ ప్రసారాలపై బ్యాన్ విధించింది బంగ్లాదేశ్ సర్కార్. ఇక టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇండియాలో పర్యటించబోమని.. తమకు ప్రత్యేక వేదికలు పాకిస్తాన్ తరహాలో ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ఈ టోర్నమెంట్ను బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్. ఇక వెంటనే స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చింది ఐసీసీ.

Also Read: Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×