// // Honda Dio vs Honda Shine: హోండా డియో vs హోండా షైన్.. వీటిలో ఏది బెస్ట్? ఎందుకు? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Honda Dio vs Honda Shine: హోండా డియో vs హోండా షైన్.. వీటిలో ఏది బెస్ట్? ఎందుకు?

Honda Dio vs Honda Shine: హోండా డియో vs హోండా షైన్.. వీటిలో ఏది బెస్ట్? ఎందుకు?
Advertisement

Honda Dio vs Honda Shine Comparison: హోండా నుంచి క్రేజీ స్కూటర్లు, బైక్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి లుక్, అదిరిపోయే మైలేజ్ తో ఆకట్టుకుంటున్నాయి. స్కూటర్ విభాగంలో హోండా డియో, బైక్ విభాగంలో హోండా షైన్ వేర్వేరు అవసరాలకు సరిపోయేలా రూపొందించింది.  డియో స్టైలిష్, ఆటోమేటిక్, సిటీ కమ్యూటింగ్ కోసం అనుకూలంగా ఉంటుంది. షైన్ మంచి మైలేజ్, ఎక్కువ పవర్, మంచి కంఫర్ట్ తో లాంగ్ రైడ్స్, కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది.

హోండా డియో vs హోండా షైన్ కీలక తేడాలు

ప్రస్తుతం మార్కెట్ లో డియో స్కూటర్ విభాగంలో పోటీ పడుతుండగా, షైన్ అనేది ఓ గేర్డ్ బైక్ గా సత్తా చాటుతోంది. ఈ రెండింటిలో కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Advertisement

⦿ ఇంజిన్ & పవర్: డియో 125 స్కూటర్123.92 cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 8.19 bhp పవర్, 10.4 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. షైన్ 125 బైక్ 123.94cc ఇంజిన్  తో వస్తుంది. 10.59 bhp, 11 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక షైన్ షైన్ 100 వేరియంట్ 98.98 cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. సుమారు 7.38 PS పవర్ ను అందిస్తుంది.

⦿ మైలేజ్: ఇక షైన్ మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ తో సుమారు 65 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. డియో సుమారు 50 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

Advertisement

⦿ డిజైన్, సౌకర్యం: డియో తక్కువ బరువు(106 kg)ను కలిగి ఉంటుంది. 12 అంగుళాల ఫ్రంట్ వీల్, స్పోర్టీ లుక్‌ తో ఉంటుంది. షైన్ 18 ఇంచుల వీల్స్, 10.5 లీటర్ ట్యాంక్‌ తో ప్రయాణానికి మరింత అనుకూలంగా ఉంటుంది.

⦿ ఫీచర్లు: డియోలో H-Smart కీలెస్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. అయితే, హైయర్ వేరియంట్స్ లో మాత్రమే ఈ అవకాశం ఉంది. ఈ స్కూటర్ లో స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది. షైన్‌ లో 5 స్పీడ్ గేర్‌ బాక్స్, కంఫర్టబుల్ సీటింగ్ ఉంటాయి.

⦿ ధర: హోండా షైన్ 100/125 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు సుమారు రూ.71,000 –రూ. 86,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. డియో ధర వేరియంట్‌ ను బట్టి రూ.70,000 – రూ.87,000 వరకు ఉంటుంది.

Read Also:  జావా 42 బాబర్ vs రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350.. ఏ కారు కొనాలంటే?

ఏది ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?   

సిటీలో సులభమైన ప్రయాణం, స్టైల్, స్టోరేజ్ కావాలనుకుంటే హోండా డియోను తీసుకోవడం మంచిది. ఎక్కువ మైలేజ్, పవర్, ఫ్యామిలీ యూజ్, లాంగ్ రైడ్స్ కావాలంటే హోండా షైన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: హోండా డియో 125 X ఎడిషన్ విడుదల, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×