E-Paper
Advertisement

Ind Vs Sa: చేత్తులెత్తేసిన బ్యాటర్లు.. తొలి టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం

Ind Vs Sa: చేత్తులెత్తేసిన బ్యాటర్లు.. తొలి టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం
Advertisement

Ind Vs Sa: కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 93 పరుగులకే భారత్ కుప్పకూలింది. దీంతో భారత్ పై సౌత్ ఆఫ్రికా 30 పరుగులు తేడాతో గెలుపొందింది. 124 లో పరుగుల లక్ష్యాన్ని చేదించలేక ఓటమి చెందింది భారత్.

Also Read: Shubman Gill: గిల్ మెడ నొప్పిపై ట్రోలింగ్… నీ కంటే లేడీస్ బెటర్ అంటూ!

Advertisement

కెప్టెన్ గిల్ మెడ నొప్పి కారణంగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ కి రాలేదు. భారత బ్యాటింగ్ లో వాషింగ్టన్ సుందర్ 31, అక్షర్ పటేల్ 26, రవీంద్ర జడేజా 16 పరుగులు చేశారు. ఇక మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో హర్మర్ 4, జాన్సన్ 3 వికెట్లతో సత్తా చాటారు.

30 పరుగుల తేడాతో గెలుపొందిన సౌతాఫ్రికా:

ఈ తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదటిరోజు భారత పేసర్లు సత్తా చాటారు. సౌత్ ఆఫ్రికాని తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులకే ఆల్ అవుట్ చేసింది భారత్. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 189 పెరుగులకు ఆల్ అవుట్ అయ్యి.. 30 పరుగుల ఆదిక్యం సంపాదించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 153 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 93 పరుగులకే ఆల్ అవుట్ అయింది. తద్వారా భారత్ పై సౌత్ ఆఫ్రికా 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవుమా ఒక్కడే హఫ్ సెంచరీ సాధించాడు.

Advertisement

సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ ని ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. హర్మర్ నాలుగు వికెట్లతో గిల్ సేన పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పేసర్ మార్కో జాన్సన్ కూడా మూడు వికెట్లు పడగొట్టి సౌత్ ఆఫ్రికా విజయంలో కీలకంగా మారాడు. వాషింగ్టన్ సుందర్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓ మోస్తరు పరుగులు చేశాడు.

Also Read: IPL 2026 Auction: పర్స్ అమౌంట్ తో KKR కింగ్ మేక‌ర్‌.. ఏ జట్టు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే

ఇక భారత క్రీడాభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ రెండు ఇన్నింగ్స్ లలో ఘోరంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ కూడా రెండవ ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు చేసేందుకు కూడా తడబడ్డారు. చివర్లో అక్షర్ పటేల్ సిక్స్ లతో చెలరేగినప్పటికీ.. కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవుమా కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ అవుట్ కాగానే.. దక్షిణాఫ్రికా విజయం తథ్యం అయ్యింది.

 

 

View this post on Instagram

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×