E-Paper
Advertisement

Ravi Shastri : మెక్‌కలమ్ బంపర్ ఆఫర్.. రవి శాస్త్రికి ఇంగ్లాండ్ బంపర్ ఆఫర్?

Ravi Shastri :  మెక్‌కలమ్ బంపర్ ఆఫర్.. రవి శాస్త్రికి ఇంగ్లాండ్ బంపర్ ఆఫర్?
Advertisement

Ravi Shastri : టీమిండియా మాజీ ప్ర‌ధాన కోచ్ ర‌విశాస్త్రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మేలేదు. ర‌విశాస్త్రీ ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి ప్ర‌ధాన న్యాయం చేస్తాడ‌ని క్రికెట్ అభిమానులు న‌మ్ముతుంటారు. ఆయ‌న క్రికెట‌ర్ గా ఉన్న‌ప్పుడు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. అలాగే కోచ్ గా ఉన్న స‌మ‌యంలో టీమిండియాలో కీలక మార్పులు చేసి టీమిండియా విజ‌యాల్లో కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ త‌రువాత రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

Also Read : Rohith- Ashwin : రోహిత్ శర్మ పెద్ద సెల్ఫీష్..? అశ్విన్ షాకింగ్ కామెంట్స్

ర‌విశాస్త్రీ ప్ర‌ధాన కోచ్.. కీల‌కంగా మారిన టీమిండియా

Advertisement

టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. ఒకప్పుడు టీమ్ డైరెక్టర్ (2014-2016)గా పనిచేసి, 2017-2021 మధ్య హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ సమయంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ గెలుచుకోవడం (బార్డర్-గవాస్కర్ ట్రోఫీ), WTC ఫైనల్‌కు చేరడం వంటి విజయాలు సాధించింది. అయితే ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోయినా విదేశాల్లో జట్టు ప్రదర్శన, కోహ్లీ నాయకత్వంలో జట్టులో విశ్వాసం నింపడంలో మాత్రం కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా ర‌విశాస్త్రీ కి ఇంగ్లండ్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ స్థానంలో ఇంగ్లాండ్ కోచ్ గా రవి శాస్త్రీని తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఇంగ్లాండ్ మూడు టెస్టులు ఓడిపోయింది. మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. అయితే ఈ ఓట‌మికి బ్రెండన్ మెక్‌కలమ్ చెత్త కోచింగ్ కారణంగా ఇంగ్లాండ్ ఓడిపోయినట్లు ట్రోలింగ్స్ చేయ‌డం విశేషం.

మెక్ క‌ల్ల‌మ్ స్థానంలో ర‌విశాస్త్రీ..?

ఈ నేప‌థ్యంలో బ్రెండన్ మెక్‌కలమ్ స్థానంలో రవి శాస్త్రికి కోచ్ గా ఛాన్స్ ఇస్తున్నారట. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంగ్లండ్ మాజీ స్పిన్న‌ర్ మాంటీ ప‌నేస‌ర్ ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు రిసెట్ కోసం ర‌విశాస్త్రీని పిలిచార‌ట‌. మెక్ క‌ల్ల‌మ్ త‌రువాత ఇంగ్లండ్ కోచ్ గా ర‌విశాస్త్రీని స‌మ‌ర్థించాడు. ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచింది. మెక్ క‌ల్ల‌మ్ ప‌ద‌వీ త్వ‌ర‌లోనే ముగియ‌నుంది. ఆస్ట్రేలియా పై పోరాడిన‌ప్ప‌టికీ.. ఇంగ్లండ్ బ్యాట్ తో గానీ, బాల్ తో కానీ నిల‌క‌డ‌గా పోటీ ప‌డ‌లేక‌పోయింది. వారి కోచ్ వైఫ‌ల్య‌మా..? కెప్టెన్ వైఫ‌ల్య‌మా..? ఆట‌గాళ్ల వైఫ‌ల్యమా..? అంటూ ప‌లు ర‌కాలుగా చ‌ర్చ‌లు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ర‌విశాస్త్రీని కోచ్ గా తీసుకుంటే ఇంగ్లండ్ మంచి ఫ‌లితాల‌ను సాధిస్తుంద‌ని భావిస్తున్నారు. టీమిండియా కోచ్ గా ఉన్న స‌మ‌యంలో 2018-19, 2020-21 ఆస్ట్రేలియాలో బ్యాక్ టూ బ్యాక్ టెస్ట్ సిరీస్ ల‌ను విజ‌యం సాధించింది. ఈ విజ‌యాలు విదేశాల్లో భార‌త క్రికెట్ కి అవ‌గాహ‌న‌గా మార్చాయి. అందుకే ఇంగ్లండ్ ర‌విశాస్త్రీకి బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ ఆఫ‌ర్ ని ర‌విశాస్త్రీ ఓకే చెబుతాడో లేదో వేచి చూడాలి మ‌రీ.

Advertisement

Also Read : Dhoni – salman: ట్రాక్టర్ తో పొలం దున్నిన ధోని & సల్మాన్.. ఒళ్ళంతా బురదతో

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×