E-Paper
Advertisement

Eesha Movie Review : ఈషా రివ్యూ.. భయపెట్టేలానే ఆశతో..

Eesha Movie Review : ఈషా రివ్యూ.. భయపెట్టేలానే ఆశతో..
Advertisement

Eesha Movie Review : ఈషా మూవీపై ఇంత హైప్ రావడానికి కారణం ఆ నిర్మాతలు. గతంలో వీరి నుంచి వచ్చిన సినిమాలు. వాటి కంటే ఈషా గొప్ప మూవీ.. అందరూ భయపడుతారు.. ప్రేక్షకుడి అంగీకార పత్రం అంటూ చేసిన ప్రమోషన్స్ వల్లే ఇంతటి హైప్ వచ్చింది. మరీ నిజంగానే సినిమాలో అంత విషయం ఉందా? నిజంగానే భయపెట్టిందా.. అనేది ఈ రివ్యూలో చూద్దాం..

కథ :

వినయ్ (అఖిల్ రాజ్), కళ్యాణ్‌ (త్రిగుణ్‌), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు) చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి దెయ్యాలు లేవు అనేది వీళ్ళ నమ్మకం. అందుకే ఆత్మలు ఉన్నాయంటూ ప్రజలను మభ్యపెట్టి, వారి దగ్గర డబ్బులు తీసుకుని ఎదిగే దొంగ బాబాల గుట్టు రట్టు చేయడం వీళ్ళకి అలవాటు. దీని కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఈ క్రమంలో వారికి ఆంధ్ర- ఒడిశా బోర్డర్లో ఉన్న బ్రెయిన్ సర్జన్ డాక్టర్‌ కమ్ బాబా అయినటువంటి ఆది దేవ్ (పృథ్వీరాజ్) గురించి తెలుస్తుంది.

Advertisement

విదేశాల్లో మంచి పేరున్న డాక్టర్ అయినటువంటి ఆది దేవ్ తన భార్య మరణానంతరం ఒరిసా సరిహద్దు గ్రామంలో ఓ ఆశ్రమాన్ని స్థాపించి, మనుషులకు పట్టిన దెయ్యాల్ని వదిలించే పనులు పెట్టుకుంటాడు.. ఈ విషయం ఆ నలుగురు స్నేహితులకు తెలుస్తుంది. ఎలాగైనా ఇతని గుట్టు రట్టు చేసి జనాల గుడ్డి నమ్మకాన్ని పోగొట్టాలని వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలో అతని నుండి వీరికి ఓ సవాలు ఎదురవుతుంది. దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని, నిరూపిస్తాను… మీరు ఓ పాడుబడ్డ బంగ్లాలో ఉండాలి అంటూ వాళ్లకి సవాలు విసురుతాడు. అందుకు వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ క్రమంలో వారికి భయానక అనుభవాలు ఎదురవుతాయి.తర్వాత వాళ్ళు తెలుసుకుంది ఏంటి? అనేది మిగిలిన కథ

విశ్లేషణ :

ఇదివరకు హర్రర్ సినిమా అనగానే ఒకసారి ఆడియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు హర్రర్ సినిమాలు అనగానే రెగ్యులర్ టెంప్లేట్లోనే ఉంటాయి అని ఫిక్స్ అయిపోతున్నారు. ఇంట్లోనే హోమ్ థియేటర్ సదుపాయాలు పెట్టుకుని అక్కడి నుండే ఓటీటీలో చూసేయొచ్చు అని ఫిక్స్ అయిపోతున్నారు. ‘ఈషా’ కూడా అలాగే ఉంటుందేమో అని కొంతమంది ప్రేక్షకులు అనుకోవచ్చు.

Advertisement

కానీ ఆ నమ్మకాన్ని ఫస్ట్ సీన్ నుండి బ్రేక్ చేస్తూనే కథనాన్ని నడిపించారు దర్శకులు శ్రీనివాస్ మన్నే. మొదటి 15 నిమిషాల్లోనే ఆడియన్స్ ఈషా వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. ప్రేక్షకులుగా కాకుండా ఆ సినిమాల్లోని ఒక పాత్రలానే కథతో ట్రావెల్ అవుతారు. హర్రర్ ఎలిమెంట్స్ ను డిఫెరెంట్ గా డిజైన్ చేశారు. టార్గెట్ ఆడియన్స్ ని అవి భయపెడతాయి.

ఇంటర్వెల్ సీన్ కూడా సెకండాఫ్ పై ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే బ్యాక్ స్టోరీ కూడా కొత్తగా పెట్టారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు దర్శకుడి ప్రతిభకి నిర్వచనం చెబుతుంది. అది కచ్చితంగా ఆడియన్స్ కి కొత్త ఫీల్ కలిగిస్తుంది. సంగీత దర్శకుడు ధృవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి ఆయువు పట్టుగా నిలుస్తుంది.

నటీనటులు విషయానికి వస్తే.. హెబ్బా పటేల్ ఎప్పటిలానే డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసింది. త్రిగున్ కి చాలా కాలం తర్వాత మంచి పాత్ర దొరికింది.’రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ పాత్రకి కొంచెం తక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు అనిపిస్తుంది. సిరి హనుమంతు ఓకే. బబ్లూ పృథ్వీరాజ్ మేకోవర్ బాగుంది. సీనియర్ నటుడు మధు నటన కూడా ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్ :

హర్రర్ ఎలిమెంట్స్
ఫస్ట్ హాఫ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

సకండాఫ్‌లో కొంత భాగం
అక్కడక్కడా ప్రెడిక్టబుల్ గా అనిపించడం

మొత్తంగా… భయపెట్టే బంగ్లా

Eesha Movie Rating : 2.75 / 5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×