E-Paper
Advertisement

క్రికెట్ జ‌ట్టును కొనేసిన రాహుల్ ద్ర‌విడ్..అశ్విన్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు

క్రికెట్ జ‌ట్టును కొనేసిన రాహుల్ ద్ర‌విడ్..అశ్విన్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు
Advertisement

European T20 Premier League:  టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టీమిండియాలో బ్యాటర్ గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్, ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. బ్యాటర్ గానే కాకుండా వికెట్ కీపర్ గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్, ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ గా కూడా కొనసాగాడు. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్, టీమిండియా హెడ్ కోచ్ గా కూడా పనిచేశారు. అలాంటి రాహుల్ ద్రవిడ్ మరో కొత్త అవతారం ఎత్తారు. ఏకంగా ఓ క్రికెట్ జట్టును కొనుగోలు చేశారు రాహుల్ ద్రవిడ్. యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్ లో (European T20 Premier League) భాగంగా ఐర్లాండ్ కు సంబంధించిన డబ్లిన్ గార్డియన్స్ (Dublin Guardians ) ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ ను ఓనర్ గా అనౌన్స్ చేస్తూ.. అధికారిక ప్రకటన చేశారు.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

క్రికెట్ జ‌ట్టుకు కొనేసిన రాహుల్ ద్ర‌విడ్..అశ్విన్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL 2026) ప్రారంభమైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనేక టి20 లీగ్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్ కూడా సందడి చేసేందుకు వచ్చేసింది. మొత్తం మూడు క్రికెట్ బోర్డులు కలిసి ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐర్లాండ్ కు సంబంధించిన డబ్లిన్ గార్డియన్స్ జట్టును కొనుగోలు చేశాడు రాహుల్ ద్రవిడ్. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ కూడా భాగస్వామ్యం అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ జట్టును కెప్టెన్ గా ముందుండి ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నడిపించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చిన అశ్విన్.. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్ ఎప్పుడు అంటే ?

యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (European T20 Premier League) ఈ సంవత్సరం ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనుంది. స్కాట్లాండ్, ఐర్లాండ్ అలాగే నెదర్లాండ్స్ క్రికెట్ జట్లు సమిష్టిగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాయి. ఇందులో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. డబ్లిన్ గార్డియన్స్ జట్టును రాహుల్ ద్ర‌విడ్ ఏకంగా రూ.116 కోట్ల‌కు కొనుగోలు చేసినట్లు స‌మాచారం. 10 ఏళ్ల పాటు ఈ హ‌క్కులు ద్ర‌విడ్ సొంతం కానున్నాయి. ఇక ప్రతి సీజన్ కు ఆటగాళ్ల శాలరీ కోసం ఒక్కో జట్టు సుమారు 11.5 కోట్లు ఖర్చు చేయనుంది. అటు అభిషేక్ బచ్చన్ ( Abhishek bacchan) కూడా ఓ జట్టుకు సహా ఓనర్ గా కొనసాగుతున్నాడు.

Advertisement

 

 

 

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×