E-Paper
Advertisement

చర్చి కడదామని వచ్చి.. కక్షలు, కార్పణ్యాల్లో చిక్కుకున్న ఫాదర్… సైలెంట్ గా మొదలై వైలెంట్ గా మారే కథ

చర్చి కడదామని వచ్చి.. కక్షలు, కార్పణ్యాల్లో చిక్కుకున్న ఫాదర్… సైలెంట్ గా మొదలై వైలెంట్ గా మారే కథ
Advertisement

Historical adventure drama : ఓటీటీలో ఒక హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామా ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో ఫైట్లు, మాస్ డాన్సులు, అదిరిపోయే ట్విస్టులు ఏమీ ఉండవు; కథ చాలా అంటే చాలా నిదానంగా సాగుతుంది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నోడు, అతని అహంకారం ఎంత అనేది రియలిస్టిక్ గా చూపిస్తారు. ఈ చిత్రం 19వ శతాబ్దం చివరలో జరుగుతుంది. కథలో డెన్మార్క్‌కు చెందిన ఒక క్రైస్తవ మతగురువు ఐస్‌లాండ్‌లోని ఒక మారుమూల ప్రాంతానికి చర్చిని నిర్మించడానికి పంపబడతాడు. ఆ తరువాత అసలు కథ ఉంటుంది. ఇది ఆస్కార్ బరిలో కూడా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎక్కడ చూడచ్చు అంటే

2022లో వచ్చిన ఈ హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామా పేరు ‘గాడ్‌లాండ్’ (Godland). ఐస్‌లాండిక్ దర్శకుడు పాల్మసన్ దీనిని తెరకెక్కించారు. ఇందులో మతగురువుగా ఎలియట్ క్రోసెట్ హోవ్, గైడ్ రాగ్నర్ పాత్రలో ఇంగ్వార్ సిగుర్డ్‌సన్ అద్భుతంగా నటించారు. ఇది 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. సుమారు 2 గంటల 23 నిమిషాల ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, చికాగో ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డ్ హ్యూగో అవార్డును గెలుచుకుంది. అలాగే ఇది ఆస్కార్ రేసులో ఐస్‌లాండ్ తరపున అధికారిక ఎంట్రీగా నిలిచి ప్రపంచ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మీరు ఈ సినిమాను Google Play Movies లో అద్దెకు తీసుకోవచ్చు. ఈ సినిమా Criterion Channel లో కూడా సబ్‌స్క్రిప్షన్ తో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

19వ శతాబ్దం చివరలో డెన్మార్క్ దేశంలో ల్యూకాస్ అనే ఒక పాస్టర్ ఉండేవాడు. అతనికి కొంచెం అతి తెలివి, అహంకారం ఎక్కువే. అయితే ఒకరోజు ఇతన్ని ఐస్‌లాండ్ అనే ఒక మారుమూల ప్రాంతానికి పంపిస్తారు కొంత మంది పెద్దవాళ్ళు. అక్కడ ఒక చర్చి కట్టి, ఫోటోలు తీసుకురావడం ఇతని పని. ల్యూకాస్ కూడా పెద్ద ఫోటోగ్రాఫర్ లాగా బిల్డప్ ఇస్తూ, భారీ కెమెరాలు మోసుకుంటూ ఐస్‌లాండ్ గడ్డ మీద అడుగుపెడతాడు. తీరా చూస్తే అక్కడ వాతావరణం మామూలుగా ఉండదు, గడ్డకట్టే చలి, అడుగు తీసి అడుగు వేయలేని కొండలు, కోనలు చూసి అతనికి ముచ్చెమటలు పడతాయి. అక్కడ వాళ్లతో మాట్లాడదామంటే వాళ్ల భాష రాదు, వాళ్లకి వీడి భాష రాదు. తోడుగా వచ్చిన గైడ్ రాగ్నర్ ఒక కరుడుగట్టిన మనిషి. ఆ రాగ్నర్ కి, ఈ పాస్టర్ కి అస్సలు పడదు.

ఇక దారి పొడవునా తిప్పలు పడుతూ, గుర్రాల మీద సావాసం చేస్తూ ఎలాగోలా చర్చి కట్టాల్సిన చోటుకి చేరుకుంటారు. అయితే ఆ ప్రయాణంలో పడ్డ కష్టం వల్ల మన పాస్టర్ గారి బుర్ర మెల్లగా పాడవుతుంది. భక్తి కంటే కోపం, అసూయ ఎక్కువైపోతాయి. చివరికి అక్కడికి వెళ్ళాక ఒక రైతు కూతురితో ప్రేమాయణం కూడా నడుపుతాడు. అప్పటికే పిచ్చెక్కినట్టు ఉన్న ల్యూకాస్, ఆ గైడ్ రాగ్నర్‌తో గొడవ పడి పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోతాడు. భగవంతుడి సేవ కోసం వచ్చిన మనిషి, ప్రకృతి దెబ్బకి, మనుషుల గొడవలకి తట్టుకోలేక ఎలా పతనం అయిపోయాడనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : కారణం లేకుండా మాయమయ్యే జనాలు… మిగిలిన వాళ్ళ పరిస్థితి ఘోరం… నరాలు తెగే ఉత్కంఠ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×