E-Paper
Advertisement

రోనాల్డో కంటే ధోనికే ఎక్కువ ఫ్యాన్స్‌..కోహ్లీ, రోహిత్ లు కూడా జుజుబీ

రోనాల్డో కంటే ధోనికే ఎక్కువ ఫ్యాన్స్‌..కోహ్లీ, రోహిత్ లు కూడా జుజుబీ
Advertisement

Rachin Ravindra ON MS Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లల్లో అభిమానులైన సొంతం చేసుకున్న మహేంద్రసింగ్ ధోని (MS Dhoni ).. టీమిండియా కు ఎన్నో టైటిల్స్, విజయాలను అందించాడు. జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన మహేంద్ర సింగ్ ధోని.. టికెట్ కలెక్టర్ గా రైల్వే శాఖలో పనిచేసే… ఆ తర్వాత టీమ్ ఇండియాలోకి వచ్చాడు. వచ్చి రాగానే టీమిండియా కెప్టెన్ గా ఎదిగిన మహేంద్ర సింగ్ ధోని… మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని పై తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడాకారులలో ధోని మొదటి వరుసలో ఉంటాడని తెలిపారు. క్రిస్టియానో రోనాల్డో (Cristiano Ronaldo) కంటే ఎక్కువగా అభిమానులు మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్నారంటూ బాంబు పేల్చారు. మహేంద్ర సింగ్ ధోని ముందు రోనాల్డో దేనికి కూడా పనికిరాడని వెల్లడించారు. దీంతో ధోనీ పై రచిన్ రవీంద్ర (Rachin ravindra) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

రోనాల్డో కంటే ధోనికే ఎక్కువ ఫ్యాన్స్‌..కోహ్లీ, రోహిత్ లు కూడా జుజుబీ

Advertisement

ప్రస్తుతం ఫిఫా టోర్నమెంట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ చూసేందుకు క్రికెటర్లు కూడా ఎగబడి వెళ్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ లు లేనివాళ్లు.. ఫిఫా వరల్డ్ కప్ లో మెరుస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా క్రిస్టియానో రోనాల్డో మ్యాచ్ తిలకించిన న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ముందు క్రిస్టియానో రోనాల్డో దేనికి పనికిరాడు అంటూ పరువు తీశారు. ప్రపంచంలోనే మహేంద్ర సింగ్ ధోని కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని.. అతనిని మించిన ఆటగాడు ఎవరూ లేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైకి అందరూ క్రిస్టియానో రోనాల్డో పేరు చెబుతారు కానీ… మహేంద్ర సింగ్ ధోని కి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారని తెలిపారు. మహేంద్ర సింగ్ ధోని ముందు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ జుజుబీ అంటూ హేళన చేశారు. దీంతో మహేంద్రసింగ్ ధోనీ పై రచిన్ రవీంద్ర చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

క్రిస్టియానో రోనాల్డో, ధోని ఇద్దరిలో ఫాలోవర్స్ ఎవరికి ఎక్కువ అంటే

క్రిస్టియానో రోనాల్డోకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ధోని కంటే రోనాల్డో ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ సంపాదించుకుని… ప్రపంచంలోనే మొట్టమొదటి క్రీడాకారుడిగా ఎదిగారు. 90 కోట్లకు పైగా అతనికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో 81 మిలియన్లు ఇండియా నుంచే కావడం గమనార్హం.

Advertisement

ఇక మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా 8.6 కోట్లు మాత్రమే ఉన్నారు. అంటే మహేంద్రసింగ్ ధోనీ కంటే రోనాల్డోకు పది రెట్లు ఎక్కువగా అభిమానులు ఉన్నారు. రోనాల్డోకు దరిదాపుల్లో కూడా ధోని లేడు. కానీ రచిన్ రవీంద్ర కు ధోని పైన ఉన్న అభిమానంతో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడని అంటున్నారు.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×