E-Paper
Advertisement

స్టైలిష్ డిజైన్.. క్రేజీ ఫీచర్స్.. టాటా సియెర్రా జూబ్లీ ఎడిషన్‌ చూస్తే మతిపోవాల్సిందే!

స్టైలిష్ డిజైన్.. క్రేజీ ఫీచర్స్.. టాటా సియెర్రా జూబ్లీ ఎడిషన్‌ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Tata Sierra Jubilee Edition Launched: టాటా మోటార్స్ పాపులర్ మిడ్‌ సైజ్ ఎస్‌యూవీ సియెర్రాకు కొత్త జూబ్లీ ఎడిషన్ ను తీసుకొచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్‌ షోరూమ్)గా నిర్ణయించింది. కొత్త మోడల్‌ లో ఇంజిన్, మెకానికల్ మార్పులు ఏవీ చేయకపోయినా, స్టైలింగ్‌ తో పాటు అదనపు యాక్సెసరీలను అందించడం ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

మూడు వేరియంట్లలో జూబ్లీ ఎడిషన్

టాటా మోటార్స్ జూబ్లీ ఎడిషన్‌ ను మూడు వేర్వేరు వేరియంట్లలో తీసుకొచ్చింది. ప్రతి వేరియంట్‌ లో ప్రత్యేకమైన యాక్సెసరీ ప్యాకేజీని అందిస్తోంది. దీంతో కొత్త కారు కొనేవారికి మరింత ప్రీమియం ఎక్స్ పీరియెన్స్ ను అందించేలా టాటా ప్లాన్ చేసింది.

1.స్మార్ట్+ జూబ్లీ ఎడిషన్

Advertisement

ఈ వేరియంట్ ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, రియర్ పార్కింగ్ కెమెరా, రూఫ్ రైల్స్, లెదరెట్ సీట్లు, నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ వినియోగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఇందులో లభిస్తాయి.

2.ప్యూర్ జూబ్లీ ఎడిషన్

దీని ప్రారంభ ధర రూ.13.39 లక్షలు. ఇందులో ముందు, వెనుక డాష్‌ క్యామ్‌ లు, పార్సెల్ ట్రే, మాగ్నెటిక్ సన్‌ షేడ్స్, లెదరెట్ సీట్ కవర్లు, స్టీరింగ్ వీల్ కవర్, అలాగే ప్రత్యేక ఎక్స్‌ టీరియర్ క్లాడింగ్ ప్యాకేజీ అందిస్తున్నారు. భద్రతతో పాటు ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

3.అడ్వెంచర్ జూబ్లీ ఎడిషన్

Advertisement

ఈ వేరియంట్ ధర రూ.16.19 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో ROQ యాక్సెసరీ కిట్, ముందు, వెనుక స్కిడ్ ప్లేట్లు, హుడ్ స్కూప్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బాడీ డీకాల్స్, అలాగే డాష్‌ క్యామ్‌ లు లాంటి అదనపు యాక్సెసరీలు ఉన్నాయి. SUVకి మరింత బోల్డ్ లుక్ ఇవ్వాలనుకునే వారికి ఇది మరింత అనుకూలంగా ఉంటుంది.

ఈ జూబ్లీ ఎడిషన్‌లో ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే ఉన్న పవర్‌ ట్రెయిన్‌ తోనే ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. అంటే కొత్తగా ప్రధానంగా యాక్సెసరీలు, స్టైలింగ్ పరంగానే అప్ డేట్ అయ్యింది. మార్కెట్‌లో సియెర్రాకు మంచి ఆదరణ లభించినప్పటికీ, అమ్మకాల పరంగా ఇంకా టాప్ ప్రత్యర్థులను చేరుకోలేకపోతోంది. 2026 జనవరి నుంచి జూన్ వరకు టాటా 43,420 సియెర్రా యూనిట్లను అమ్మింది. ఇదే సమయంలో హ్యుందాయ్ క్రెటా 91 వేలకుపైగా యూనిట్లు అమ్ముడై అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత మారుతి విక్టోరిస్, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ఉన్నాయి.

Read Also: టాటా నెక్సాన్ To ఆడి Q3.. దీపావళికి ఎంట్రీ ఇవ్వబోతున్న టాప్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×