E-Paper
Advertisement

FIFA World Cup : నాకౌట్కు పోర్చుగల్

FIFA World Cup : నాకౌట్కు పోర్చుగల్
Advertisement

FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచిన పోర్చుగల్… నాకౌట్ చేరిన మూడో జట్టుగా నిలిచింది. గ్రూప్-Hలో భాగంగా ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో… 2-0 గోల్స్ తేడాతో నెగ్గింది… పోర్చుగల్. ఆ రెండు గోల్స్ వేసి పోర్చుగల్ అభిమానుల్లో జోష్ నింపాడు… బ్రూనో ఫెర్నాండెజ్.

ఆట ఆరంభం నుంచి పోర్చుగల్, ఉరుగ్వే హోరాహోరీగా తలపడ్డాయి. కానీ తొలి అర్ధభాగంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక… 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ కొట్టిన షాట్‌… స్టార్ ఆటగాడు రోనాల్డో తలమీదుగా వెళ్లడంతో… తానే హెడర్ గోల్ చేసినట్లు రొనాల్డో సంబరాలు చేసుకున్నాడు. కానీ… పదేపదే రీ ప్లే చూసిన తర్వాత… బంతిని రొనాల్డో హెడర్‌గా పంపలేదని తేల్చారు. దాంతో… ఆ గోల్ కాస్తా బ్రూనో ఫెర్నాండెజ్ ఖాతాలో చేరింది. పోర్చుగల్ 1-0 గోల్స్ ఆధిక్యంలోకి వెళ్లింది.

Advertisement

ఆ తర్వాత ఉరుగ్వే ఆటగాళ్లు కూడా పదే పదే పోర్చుగల్ గోల్ పోస్ట్ మీద దాడులు చేశారు. 75వ నిమిషంలో ఉరుగ్వే ఆటగాడు కొట్టిన షాట్‌ను పోర్చుగల్ గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. మరో మూడు నిమిషాల తర్వాత ఉరుగ్వేకు ఫ్రీ కిక్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో నిమిషానికే మళ్లీ ఉరుగ్వే ఆటగాడు కొట్టిన షాట్‌ను… పోర్చుగల్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. మూడుసార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా సఫలం కాకపోవడంతో… ఉరుగ్వే ఆటగాళ్లు, అభిమానులు నిరాశపడ్డారు. ఇక ఆట మరో నిమిషంలో ముగుస్తుందగా పోర్చుగల్ కు పెనాల్టీ కిక్ వచ్చింది. ఆ అవకాశాన్ని కూడా బ్రూనో ఫెర్నాండెజ్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఉరుగ్వే గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ… బంతిని నెట్లోకి పంపాడు. దాంతో.. పోర్చుగల్ 2-0 గోల్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. 9 నిమిషాల అదనపు సమయం ఆఖర్లో కూడా… ఫెర్నాండెజ్ రెండుసార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించినా… బంతి గోల్ పోస్ట్ బార్ ను తాకుతూ బయటికి వెళ్లిపోయింది. చివరికి ఆట ముగిసే సమయానికి 2-0 ఆధిక్యంలో నిలిచిన పోర్చుగల్… ఉరుగ్వేపై విజయంతో నాకౌట్‌కు చేరింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×